
ప్లాస్టిక్‌తో మత్స్య ఉత్పత్తులకు ముప్పు
నరసాపురం రూరల్: ప్లాస్టిక్ వినియోగం వల్ల సముద్ర జీవులకు, ఉత్పత్తులకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ఫిషరీష్ సర్వే ఆఫ్ ఇండియా శాస్తవేత్త జీవీఏ ప్రసాద్ అన్నారు. మంగళవారం నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలోని ఆక్వా యూనివర్సిటీలో విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారతదేశానికి సంబంధించిన వివిధ సముద్ర మత్స్యవనరులు, సముద్రంలోకి వచ్చి చేరిన ప్లాస్టిక్ వ్యర్థాల వలన ఈ వనరులకు కలుగుతున్న నష్టాలను తెలియజేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్సిటీ ఓఎస్‌డీ టి సుగుణ, మైరెన్ ఇంజనీరింగ్ హెడ్ సి.ధనుంజయ్‌రావు మాట్లాడుతూ సముద్ర జీవులకు ప్లాస్టిక్ వాడకం వలన ముప్పు వాటిల్లుతుందని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని అన్నారు. ఈ సందర్భంగా వినిధ రకాల సముద్ర మత్స్య వనరులు, తీర ప్రాంత మత్స్య సంపద, మత్స్యరంగ పరిశోధనలో ఫిషరీస్ సర్వేఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐ) వారు ఉపయోగిస్తున్న వివిధ రకాల పడవలకు సంబంధించిన వివరాలను పోస్టర్ల రూపంలో, వివిధ రకాల వలల నమూనాలను ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీడీ రావు, మత్స్య కళాశాల విద్యార్థులు, కళాశాల ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.
ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త ప్రసాద్