
పత్రికా స్వేచ్ఛకు విఘాతం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా కేసులు నమోదు చేయడం దారుణం. జర్నలిస్టులపైనే కాకుండా ఎడిటర్లపై కూడా కేసులు పెట్టడానికి కూటమి సర్కారు వెనుకాడడం లేదు. ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక పత్రికలపై దాడికి తెగబడుతున్నారు.
– కంభం విజయరాజు, వైఎస్సార్ సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్