
బాధితులకు భరోసా కల్పించాలి
భీమవరం: వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు పోలీస్ శాఖ భరోసాగా ఉండాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. భీమవరం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన సందర్భంగా పోలీసు స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలు తిరిగి పునరావృతం గాకుండా పూర్తి స్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలని ఎస్పీ ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 9 మంది బాధితులు అర్జీలను అందచేశారు.
నరసాపురం రూరల్: సీతారాంపురం సౌత్ ఎస్టీ కాలనీలో ఉంటున్న యానాదులకు ఆధార్ కార్డులు ఇవ్వాలని స్థానిక ఎస్టీ కాల నీవాసులు సోమవారం సచివాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ఆధార్ కార్డు లేనివారు 19 మంది, అడ్రస్ మార్చాల్సిన వారు 12 మంది, ఇంటి పేర్లు మార్చాల్సిన వారు 15 మంది కలిపి మొత్తం 50 మంది వరకు ఉన్నారన్నారు. కార్డుల్లో అడ్రస్‌లు సక్రమంగా లేకపోవడం, పిల్లలకు కొత్త ఆధార్ కార్డులు లేకపోవడంతో అనేక సంక్షేమ పథకాలు అందడం లేదని తెలిపారు. యానాదుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని వారు అన్నారు. అనంతరం సచివాలయం కార్యదర్శి, వీఆర్వోలకు వినతిపత్రం అందజేశారు.
భీమవరం(ప్రకాశంచౌక్): పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారం పారదర్శకంగా, నాణ్యతతో ఉండాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో ఆయన పాల్గొని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం ఉండాలన్నారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అర్జీలు పరిష్కరించాలని అదేశించారు. ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబంధిత శాఖకు పంపాల న్నారు. ఈ సందర్భంగా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. యూరియా సమస్యపై రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద సోమవారం కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపి జేసికి వినతిపత్రం అందజేశారు. విభిన్న ప్రతిభావంతుల హక్కుల పరిరక్షణ చట్టం పూర్తి స్థాయిలో అమలు చేయాలని, పాత సదరం సర్టిఫికెట్లు కొనసాగించాలని కోరుతూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.
ఏలూరు టౌన్: ఏలూరు రేంజ్ పరిధిలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేలా పోలీస్ అధికారులు శ్రద్ధ వహించాలని.. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రజలకు జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీలుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పోలీస్ అధికారులు ఐజీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఏలూరు రేంజ్ ఐజీని మర్యాదపూర్వకంగా కలిశారు.

బాధితులకు భరోసా కల్పించాలి

బాధితులకు భరోసా కల్పించాలి