
పెనుగొండ సర్పంచ్‌కు అరుదైన గౌరవం
పెనుగొండ: పెనుగొండ సర్పంచ్ నక్కా శ్యామలా సోనీ శాస్త్రికి అరుదైన గౌరవం దక్కింది. ఢిలీల్లో భారత నాణ్యతా మండలి ఆధ్వర్యంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ నెల 15న నిర్వహించబోయే సదస్సుకు ఆహ్వానం పంపారు. ఈ సదస్సులో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా 75 మంది సర్పంచ్‌లను ఎంపిక చేయగా పెనుగొండ సర్పంచ్‌కు చోటు దక్కించింది. గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగం, తాగునీరు, పారిశుధ్య సమస్యలకు పరిష్కారంపై సర్పంచ్‌ల అభిప్రాయాలు తీసుకోనున్నారు.
భీమవరం: యనమదుర్రు డ్రెయిన్‌లోకి దూకిన మహిళ మృతదేహం లభ్యమైంది. టూటౌన్ ఎస్సై కె.రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని చినఅప్పారావు తోటకు చెందిన బరువు నాగమణి(55) కుమారుడు అప్పులు పాలవడంతో నాలుగేళ్లక్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటినుంచి మానసిక ఆర్యోగం దెబ్బతిన్న నాగమణికి వైద్యం చేయిస్తున్నారు. ఈనెల 8న ఇంటి నుంచి వచ్చిన ఆమె పట్టణంలోని యనమదుర్రు డ్రెయిన్ కాలిబాట వంతెన వద్ద డ్రెయిన్‌లోకి దూకింది. శనివారం నాగమణి మృతదేహం భీమవరం రూరల్ మండలం లోసరి వద్ద తేలడంతో ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై రామరావు చెప్పారు.