
నూతన పద్ధతులతో ఆక్వా రంగ అభివృద్ధి
కాళ్ల: రైతులు నూతన పద్ధతులను అవలంభిస్తే ఆక్వా మరింత అభివృద్ధి చెందుతుందని మండలి చైర్మన్ రాజు మోషేన్‌రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. కాళ్ల మండలం పెదఅమీరం రాధాకృష్ణ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న ఆక్వా ఎక్స్ ఇండియా కార్యక్రమం శనివారంతో ముగిసింది. మూడో రోజు మండలి చైర్మన్ సందర్శించారు. స్టాల్స్‌ను సందర్శించి ఆక్వా సాగుపై పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దంతులూరి వేణు రాజును ఆయన అభినందించారు. ఆక్వా రంగంలో కొత్త టెక్నాలజీని ఈ ప్రాంతానికి తీసుకురావడం శుభ పరిణామం అన్నారు. ఆక్వా ఎక్స్‌పోతో ఈ ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఎక్స్‌పో నిర్వహిస్తూ రైతులకు మేలు చేస్తున్న సీఈవో దంతులూరి వేణును అభినందించారు.