
కూటమి చిన్నచూపు
గత ప్రభుత్వంలో
ప్రతిష్టాత్మకంగా..
సీఎం ఈఐ కేంద్రాల్లో నేత్ర వైద్య సేవలు
సాక్షి, భీమవరం: కంటి వైద్యసేవలపై కూటమి ప్ర భుత్వం చిన్నచూపు చూస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల్లో ఏడాది కాలంగా వైద్య సేవలు నిలిచిపోవడంతో పేదవర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారు. కంటి పరీక్షల కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
2018లో ఏర్పాటు : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట, ఆకివీడు, భీమవరం, భీ మడోలు, దెందులూరు, చింతలపూడి, పోలవరం, పాలకొల్లు, నరసాపురంలలోని సీహెచ్‌సీల్లో 2018 లో అప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈఐ కేంద్రా లను ఏర్పాటుచేసింది. వీటి నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ఒక్కో కేంద్రంలో ఒక ఆఫ్త్తమాలజీ అసిస్టెంట్, ఒక ఎక్యుప్‌మెంట్ అసిస్టెంట్ అందుబాటులో ఉండేవారు. ఆధునాతన ఆటోమెటిక్ రిఫ్రాక్టర్ మీటర్, కంటి లోపల భాగాలను పరీక్షించే ఫండస్ కెమెరాలతో కంప్యూటర్ ద్వారా డీఆర్, గ్లకోమా, కేటరాక్ట్, మాక్యులర్ డీజనరేషన్, హైపర్‌టెన్సివ్ రెటీనోపతి తదితర పరీక్షలు చేసేవారు. అవసరమైన వారికి మందులు, కళ్లజోళ్లు అందజేసేవారు. కంటి సమస్యలు, శస్త్రచికిత్సలు అవసరమైన వారిని తొలిదశలోనే గుర్తించి మెరుగైన వైద్య నిమిత్తం సమీపంలోని ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆస్పత్రులకు పంపేవారు. పేదవర్గాల వారికి ఈ కేంద్రాలు ఎంతో ప్రయోజనకరంగా ఉండేవి.
ఏడాదిగా నిలిచిన సేవలు
గతేడాది సెప్టెంబరు 4తో కాంట్రాక్టు సంస్థతో ఉన్న ఎంఓయూ గడువు ముగియడంతో సేవలు నిలిచిపోయాయి. అప్పట్లో రెన్యూవల్ చేయకపోవడంతో ఆస్పత్రుల్లోని ఆటోమెటిక్ రిఫ్రాక్టర్ మీటర్, ఫండస్ కెమెరాలు, ఇతర సామగ్రిని కాంట్రాక్టు సంస్థ తరలించుకుపోయింది. దీంతో కంటి వైద్య పరీక్షల కోసం పేదవర్గాల వారు ఇబ్బంది పడాల్సి వస్తోంది. కంటి పరీక్షలు చేసి కళ్లజోడు ఇచ్చేందుకు దాదాపు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు ఖర్చవుతుంది. మొత్తం ఆయా పరీక్షలకు రూ.3,000 వరకు ఖర్చవుతుందని అంచనా. గతంలో ఈ సేవలన్నీ ఉచితంగా అందేవి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కంటి వైద్యులు అందుబాటులో ఉన్న భీమవరం తదితర చోట్ల కొన్ని రకాల కంటి పరీక్షలు నిర్వహిస్తున్నా, ఉ చితంగా కళ్లజోళ్లు, పూర్తిస్థాయిలో సేవలు అందించలేని పరిస్థితి ఉందని రోగులు అంటున్నారు. గతంలో మాదిరి కంటి వైద్య పరీక్షల నిర్వహణకు, ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీకి ప్రభుత్వం చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల నిర్వహణతో పాటు వృద్ధులు, విద్యార్థుల కోసం గ్రామాల్లో, పాఠశాలల్లో వైఎస్సార్ కంటి వెలుగు శిబిరాలను నిర్వహిస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల కాంట్రాక్టు సంస్థ మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ)ను ఎప్పటికప్పుడు రెన్యూవల్ చేస్తూ వైద్యసేవలకు అంతరాయం కలగకుండా చూసేవారు. ఈఐ కేంద్రాలు ప్రారంభం నుంచి గతేడాది నిలిచేనాటి వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 2,35,943 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 2,199,37 మందికి రిఫ్రాక్షన్ చెక్స్, 98,950 మందికి ఫండస్ చెక్స్ చేయగా, 1,50,656 మందికి కళ్లజోళ్లు అందజేశారు. 884 డీఆర్, 626 గ్లకోమా, 140 మాకులర్ డిజనరేషన్, 14,080 కాటరాక్ట్, 76 హైపర్‌టెన్సివ్ రెటినోపతి రోగులను గుర్తించి సంబంధిత వైద్యసేవలు, శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఒక్కో కేంద్రంలో రోజూ వంద మందికి పైగా రోగులు వచ్చి కంటి వైద్యసేవలను ఉచితంగా పొందేవారు.
కేంద్రం మొత్తం పరీక్షలు రిఫ్రాక్షన్ చెక్స్ కళ్లజోళ్లు ఫండస్ చెక్స్
ఆచంట 27,970 27,832 18,131 13,831
ఆకివీడు 20,576 20,407 13,688 7,246
భీమడోలు 25,179 21,208 14,020 10,556
భీమవరం 23,944 23,638 17,807 8,899
చింతలపూడి 29,747 25,631 17,625 13,619
దెందులూరు 24,401 22,320 13,499 11,815
పాలకొల్లు 30,553 29,815 21,443 12,491
పోలవరం 25,883 22,420 15,453 9,858
నరసాపురం 27,690 26,666 18,990 10,635
కానరాని కంటి వెలుగు
ముఖ్యమంత్రి ఈఐ కేంద్రం సేవలు నిలిచి ఏడాది
కాంట్రాక్టు సంస్థతో గతేడాది సెప్టెంబరులో ముగిసిన ఎంఓయూ
కంటి వైద్య సేవల కోసంపేదల ఇబ్బందులు
ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితి
గతంలో ఉమ్మడి జిల్లాలో 2.35 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు