
అక్షరంపై కక్ష సాధింపు తగదు
అక్షరం ప్రశ్నిస్తుంది.. అక్రమం ఎక్కడుంటే అక్కడ గర్జిస్తుంది. ఒక అక్షరాన్ని బహిష్కరిస్తే లక్ష అక్షరాలు పుట్టుకొస్తాయి. పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. కూటమి ప్రభుత్వం ‘సాక్షి’ మీడియాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. తప్పులు ఎత్తిచూపుతున్న ఎడిటర్, పాత్రికేయులపై కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. సమాజంలో ప్రతిఒక్కరూ పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలి.
– దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్), వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు