
కలెక్టరేట్ నిర్మాణంపై రాద్ధాంతం తగదు
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్‌ను ఎక్కడ నిర్మించాలనే దానిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా లేనిపోని చర్చ, అనవసరమైన రా ద్ధాంతం జరుగుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్ విమర్శించారు. శుక్రవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో కలెక్టరేట్ సమస్యపై వామపక్షాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మూడేళ్ల కిందటే కలెక్టరేట్ నిర్మాణానికి భీమవరం మార్కెట్ యార్డులో 20 ఎకరాల స్థలా న్ని కేటాయిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసిందన్నారు. ఇది ఆమోదయోగ్యమైంది కావడంతో ఎవరూ అభ్యంతరం చెప్పలేదన్నారు. గతంలో ప్రకటించిన విధంగానే కలెక్టరేట్ నిర్మించాలని, దీనిలో భాగంగా ఈనెల 15న మార్కెట్ యార్డు స్థల పరిశీలనకు అందరూ రావాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ ప్రస్తుతం కలెక్టరేట్ నిర్మాణానికి సూచిస్తున్న ప్రాంతాలు అనువైనవి కాదన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి లంకా కృష్ణమూర్తి, ఎంసీపీఐయూ జిల్లా నాయకుడు జి.రాంబాబు మాట్లాడుతూ గతంలో కేటాయించిన విధంగానే కలెక్టరేట్‌ను మార్కెట్ యార్డులో నిర్మించాలన్నారు. సమావేశంలో సీపీఎం పట్టణ కార్యదర్శి బి.వాసుదేవరావు, సీపీఐ కార్య దర్శి చెల్లబోయిన రంగారావు, మల్లుల సీతారాంప్రసాద్, దండు శ్రీనివాసరాజు, బొక్కా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.