
హెచ్‌ఐవీని పారదోలుదాం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నివారణ ద్వారానే ఎయిడ్స్ వ్యాధిని సమాజం నుంచి తరిమివేయగలమని, జిల్లాలో హెచ్‌ఐవీ కేసులు పెరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీఎంహెచ్‌ఓ పీజే అమృతం అన్నారు. స్థానిక సీఆర్‌రెడ్డి మహిళా కళాశాల నుంచి శుక్రవారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ 2025–26, ఐఈసీ మారథాన్ 5కే రెడ్‌రన్ ర్యాలీని ఎర్రబెలూన్లు ఎగురవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడానికి, వ్యాధి నివారణపై అవగాహన కలిగించడానికి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మద్దతుగా నిలవడానికి మారథాన్ 5కే రెడ్‌రన్ నిర్వహించనున్నామన్నారు. హెచ్‌ఐవీ సంబంధిత సమాచారం కోసం జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ 1097ను సంప్రదించాలని కోరారు. సెట్‌వెల్ సీఈఓ కేఎస్ ప్రభాకరరావు, ఆర్‌ఐఓ ప్రభాకర్, దిశ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ జి.ఆదిలింగం పాల్గొన్నారు. ర్యాలీ కలెక్టరేట్ వద్ద గల ఇండోర్ స్టేడియం వరకు చేరింది.
ఏలూరు (టూటౌన్): జిల్లాలోని పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం 25,099 మంది విద్యార్థులకు 22,142 మంది వివరాలు రెన్యూవల్ చేసినట్టు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి వై.విశ్వమోహన్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. మిగిలిన 2,498 మందిలో 2,000 మంది విద్యార్థుల బయోమెట్రిక్ కళాశాలల్లో పెండింగ్‌లో ఉందని, ప్రిన్సిపాళ్లు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు గ్రా మ, వార్డు సచివాలయంలో 5 స్టెప్ వెరిఫికేషన్ పూ ర్తి చేసుకోవాలన్నారు. ఈనెల 30లోపు కొత్త రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్ ప్రక్రియ పూర్తికావాలన్నారు.