ఎరువులు అందించడంలో కూటమి విఫలం | - | Sakshi
Sakshi News home page

ఎరువులు అందించడంలో కూటమి విఫలం

Sep 5 2025 7:39 AM | Updated on Sep 5 2025 7:39 AM

ఎరువు

ఎరువులు అందించడంలో కూటమి విఫలం

ఎరువులు అందించడంలో కూటమి విఫలం

రైతులకు అన్ని విధాలా దగా

పెనుగొండ: దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న రైతులకు ఎరువులు అందించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు విమర్శించారు. గురువారం తూర్పుపాలెంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. యూరియా కొరతపై తీవ్ర విమర్శలు చేశారు. యూరియా కొరతతో రైతులు అల్లాడుతుంటే ప్రశ్నించిన ప్రతిపక్షంపైనే సీఎం చంద్రబాబు, కూటమి నాయకులు బురద జల్లుతున్నారన్నారు. యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతుంటే మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సాగుకు ఆది నుంచి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా లేకపోవడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. మొదట్లో సాగు నీరు ఇవ్వలేకపోయారని.. ఇప్పుడు ఎరువులూ సరఫరా చేయలేకపోతున్నారని దుయ్యబట్టారు.

మంత్రి ఇలాకాలో సాగునీటి కష్టాలు

నీటిపారుదల శాఖ మంత్రి ఉన్న నియోజకవర్గంలోనే సాగుకు నీరు అందించలేకపోయారని శ్రీరంగనాథరాజు ఎద్దేవా చేశారు. భారీ వర్షాలతో ముంపునకు గురైన చేల రైతులను ఆదుకోలేదన్నారు. ఆచంట నియోజకవర్గంలో నక్కల డ్రెయిన్‌, గోస్తనీ డ్రెయిన్‌లతో ఆయా ప్రాంతాల్లో వరి చేలు ఊ డ్పులు కాగానే రెండు, మూడుసార్లు ముంపునకు గురయ్యాయన్నారు. దీంతో నాట్లు కుళ్లిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వీరికి ఇప్పటికీ బీమా అందలేదన్నారు. వైఎస్సార్‌ సీపీ పాలనలో ఎప్పటి నష్టపరిహారం అప్పుడే అందజేశామని గుర్తు చేశారు. అలాగే కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకూ ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల చేయలేదన్నారు. రైతులకు అన్ని సేవలూ ఒకే చోట అందించేలా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తే వాటిని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ఎరువుల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడితే తప్పేంటంటూ కించపరిచేలా మంత్రులు వ్యాఖ్యానించడం దారుణమన్నారు.

ఇప్పటికై నా రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఈనెల 9న నిర్వహించబోయే ధర్నాల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్రి నారాయణరెడ్డి (వాసు), సర్పంచ్‌లు జక్కంశెట్టి శ్రీరాములు, సుంకర సీతారామ్‌, ఇళ్ల లక్ష్మీ చంద్రకళ, గుబ్బల ఉషారాణి వీరబ్రహ్మం, బుర్రా రవికుమార్‌, మండల కన్వీనర్లు గూడూరి దేవేంద్రుడు, నల్లి మిల్లి బాబిరెడ్డి, జక్కంశెట్టి చంటి, జిల్లా ప్రధాన కార్యదర్శి దంపనబోయిన బాబూరావు, నాయకులు కర్రి వేణుబాబు, కోట వెంకటేశ్వరావు, చింతపల్లి గురుప్రసాద్‌, పోతుమూడి రామచంద్రరావు, చిటికెన బాబీ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా కనిపించడం లేదా?

సాగుకు ఆది నుంచీ కష్టాలే..

ఈనెల 9న వైఎస్సార్‌సీపీ ధర్నా

మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు

పీవీఎల్‌ నరసింహరాజు

కాళ్ల: కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలా దగా చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఉండి నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్‌ నరసింహరాజు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి ఓటేస్తే రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రం ద్వారా పూర్తిస్థాయిలో సేవలందించారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం రైతులు యూరియా కోసం రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికే దీనిపై కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించామని, అయినా ప్రయోజనం లేదన్నారు. రానున్న రోజుల్లో రైతులు కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. యూరియా కోసం రైతులు రోడ్లు ఎక్కడం ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈనెల 9న భీమవరం, ఉండి నియోజకవర్గాల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు.

ఎరువులు అందించడంలో కూటమి విఫలం 1
1/1

ఎరువులు అందించడంలో కూటమి విఫలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement