
కొనసాగుతున్న గోదావరి వరద
నరసాపురం: నరసాపురంలో వశిష్ట గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. రెండు రోజులతో పోలిస్తే గురువారం కాస్త తగ్గినా పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. వలంధర్‌రేవు, లలితాంబ ఘాట్, పడవల రేవు వద్ద గోదావరి ఉగ్రంగానే ప్రవహిస్తోంది. గణేష్ నిమజ్జనాలు యథావిధిగా సాగుతున్నాయి. మాధవాయిపాలెంలో పంటు రాకపోకలు పునరుద్ధరించలేదు. వారం రోజులుగా పంటు తిరగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
తాడేపల్లిగూడెం: ‘ఆప్కాస్ ఆపరేటర్ లైంగిక వేధింపులు’ శీర్షికన ఈనెల 1న ప్రచురించిన కథనానికి తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు స్పందించారు. ఆప్కాస్ ఆపరేటర్ బాలాను ప్రస్తుతానికి విధులకు దూరంగా ఉంచామని, లైంగిక వేఽధింపుల వ్యవహారంపై నిజాలను నిగ్గుతేల్చడానికి ఒక అధికారిని నియమిస్తున్నామన్నారు. సదరు అధి కారి నివేదిక వచ్చిన తర్వాత ఆపరేటర్‌ను కా ర్యాలయ విధుల నుంచి బయట విధులను నియమించే అవకాశం ఉందన్నారు. అప్పటికీ బాలా ప్రవర్తనలో మార్పు రాని పక్షంలో విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని, నిబంధనల మేరకు జిల్లా ఉన్నతాధికారి నిర్ణయం తీసుకుంటారన్నారు.
వీరవాసరం: రైతులు యూరియాను అవసరం మేరకు మాత్రమే వాడాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. గత సార్వా పంటలో ఎంత యూరియా అవసరమైందో అంతే ప్రస్తుతం కూడా నిల్వలు ఉంచామని చెప్పారు. వీరవాసరంలో గురువారం ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్ గోడౌన్లను తనిఖీ చేశారు. వ్యవసాయ అనుబంధ పంటలకు మాత్రమే యూరియా ఇవ్వాలని ఆదేశించారు. రైతు వ్యవసాయ విస్తీర్ణం బట్టి యూరియా ఇవ్వాలని సొసైటీలకు సూచించారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, తహసీల్దార్ రామాంజనేయులు, మండల వ్యవసాయ శాఖ అధికారి బిన్సీ బాబు ఉన్నారు.
కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ

కొనసాగుతున్న గోదావరి వరద