
రాయితీని తగ్గించుకునే ప్రయత్నం
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): కేంద్ర ప్రభుత్వం యూరియాపై సబ్సిడీ తగ్గించుకునేందుకు చేస్తున్న కుట్రలో భాగంగానే యూరియా దిగుమతి చేసుకోకుండా కొరత సృష్టిస్తోందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ విమర్శించారు. ఏలూరులోని అన్నే భవనంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం యూరియాపై సబ్సిడీని కుదించి వేసిందన్నారు. రాష్ట్రానికి సరిపడా యూరియా అందించని కేంద్రంపై ఒత్తిడి చేయకుండా సీఎం చంద్రబాబు ప్రతిపక్షాలపై విమ ర్శలు చేయడం తగదన్నారు. యూరియా కోసం రైతులు సొసైటీలు, ఎరువుల షాపులు ముందు క్యూలు కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అలాగే ఆధార్‌తో లింకు పెట్టి యూరియా ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. రైతులకు నానో యూ రియా అంటగట్టడం తగదన్నారు. వర్షాల సీజన్‌లో ఎరువుల కొరత దారుణమన్నారు. అనంతపురం జిల్లాలో సోలార్ ఎనర్జీ కంపెనీలకు సేకరిస్తున్న భూములు పరిశీలనకు వెళ్లిన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డికి గుంతకల్లు ఎమ్మెల్యే జి.జయరాం ఫోన్ చేసి దూషించడాన్ని ఖండిస్తున్నామన్నారు.