
పీ4 మార్గదర్శులకు అవగాహన
భీమవరం (ప్రకాశంచౌక్): డీఆర్డిఏ, డ్వామా శాఖలతో ప్రేరేపితులై ముందుకు వచ్చిన పీ4 మార్గదర్శులతో మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో ఇన్‌చార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే వివిధ మార్గాలుద్వారా సేవలందిస్తున్న సమాజ నిర్దేశకులందరినీ ఒకే తాటిపై తీసుకువచ్చి మార్గదర్శకులుగా నమోదు చేసి బంగారు కుటుంబాలకు సేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. మార్గదర్శకులుగా నమోదు కావడానికి మనసున్న ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. నమోదయ్యే సందర్భంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టి తీసుకురావాలన్నారు. ప్రతి సచివాలయంలో నమోదుకు ఉచితంగా అవకాశం కల్పించామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మార్గదర్శిగా ఆర్థికంగా ఒక్కటే కాదని, సేవా తత్పరతతో చేసే ఏ కార్యక్రమం అయినా నిర్వహించవచ్చన్నారు.