
బహుళ పంటలతో అధిక లాభాలు
కామవరపుకోట: కొబ్బరి, ఆయిల్‌పామ్ వంటి పంటలో బహుళ పంటలు సాగు చేయటం వల్ల రైతులు అధిక లాభాలు పొందవచ్చునని ఉద్యానవనశాఖ డైరెక్టర్ కె.శ్రీనివాసులు అన్నారు. మండలంలో తడికలపూడి రత్నగిరినగర్, కళ్లచెరువు గ్రామాల్లో ఆయన పర్యటించి అంతర పంటలను పరిశీలించారు తడికలపూడి గ్రామాల్లో కొబ్బరి, ఆయిల్‌పామ్ పంటలు మల్టీ క్రాఫింగ్ బహుళ పంట సాగు చేస్తున్న రైతుల తోటల్లోని కలెక్షన్ సెంటర్ సోలార్ కోల్డ్ రూమ్ డ్రైవర్ యూనిట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు బహుళ పంట సాగు పద్ధతిని అవలంబించాలని అవలంభించడం వల్ల ఆదాయం పెరుగుతుందని తెలిపారు. రత్నగిరినగర్‌లో కొబ్బరి పంటలో కోకో, మిరియాలు సాగుతో పాటు వివిధ రకాల కొత్త సుగంధ ద్రవ్యాలు పంటలు కూడా పండించే విధానాలను రైతులందరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది? ఏ పంట వేస్తే ఎకరానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఎలా పొందవచ్చు? అనే విషయాలు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట మండల ఉద్యానవన శాఖ అధికారి రత్నమాల ఉన్నారు.