
కొనసాగిన ఇళ్ల తొలగింపు
ఆకివీడు: స్థానిక ధర్మాపుర అగ్రహారంలోని మంచినీటి చెరువు చుట్టూ ఉన్న ఇళ్ల తొలగింపు ప్రక్రియ రెండో రోజు ఆదివారం కూడా కొనసాగింది. బాధితులు తమ ఇళ్లను ఖాళీ చేయడంతో పొక్లెయిన్లతో కూల్చివేశారు. బాఽధితులు ఎవరూ అడ్డుపడకపోవడంతో కూల్చివేత కార్యక్రమం సాఫీగా సాగిపోయింది. ఆదివారం రాత్రి వరకూ తొలగింపు పనులు సాగాయి. స్థానిక ఆనాల చెరువు, దొరగారిచెరువు గట్లపై ఆక్రమణలతో పాటు జాతీయరహదారి ప్రధాన సెంటర్‌లో ఆక్రమణలు, విస్తరణ కార్యక్రమాలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. ఇటీవల నగర పంచాయతీ పరిధిలోని మంచినీటి చెరువుల్ని పరిశీలించిన కలెక్టర్ నాగరాణి చెరువు గట్లపై ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు.