ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ దారుణం | - | Sakshi
Sakshi News home page

ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ దారుణం

Jul 20 2025 5:49 AM | Updated on Jul 20 2025 5:51 AM

మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

బుట్టాయగూడెం: ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ను మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తీ వ్రంగా ఖండించారు. శనివారం రాత్రి విలేకరులతో మా ట్లాడు తూ ఎంపీ మిథున్‌రెడ్డిని సీఎం చంద్రబాబు కేవలం కక్షపూరిత రాజకీయాలతోనే అరెస్ట్‌ చేయించారని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులను టార్గెట్‌ చేస్తూ జైలులో పెట్టాలని చూస్తున్నారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎంత మందిని అరెస్ట్‌ చేసినా వైఎస్సార్‌సీపీ జెండాను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు.

పీఎంశ్రీకి పెదతాడేపల్లి గురుకులం ఎంపిక

తాడేపల్లిగూడెం రూరల్‌: పెదతాడేపల్లి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జిల్లా ఉత్తమ పీఎంశ్రీ పాఠశాలగా ఎంపికై ందని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ శ్యామ్‌కుమార్‌ తెలిపారు. శనివారం గురుకుల పాఠశాలను ఐదుగురు సభ్యులతో కూడిన బృందం పరిశీలించింది. బృందంలో ఎంఈఒలు వి.హనుమ, పీఎంకే.జ్యోతి, ఏఎంఓ సుబ్రహ్మణ్యం, పీఎంశ్రీ వీరాస్వామి ఉన్నారు. ఈ సందర్భంగా శ్యామ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలోని 25 గురుకుల పాఠశాలలను పరిశీలించామన్నారు. కిచెన్‌ గార్డెన్‌, ఆటస్థలం, కంప్యూటరైజ్డ్‌ లైబ్రరీ, సైన్స్‌ ల్యాబ్‌, కెరీర్‌ గైడెన్స్‌ ల్యాబ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, స్కిల్‌ ల్యాబ్‌ తదితర అంశాల ప్రాతిపదికగా తీసుకుని పెదతాడేపల్లి గురుకులాన్ని ఉత్త మ పాఠశాలగా ఎంపిక చేశారన్నారు. పాఠశా ల ప్లే ఫీల్డ్‌ అభివృద్ధికి రూ.5 లక్షలు, రసాయన శాస్త్ర ప్రయోగశాలకు రూ.13 లక్షలు మంజూరవుతాయని తెలిపారు. ప్రిన్సిపాల్‌ బి.రాజారావు, వైస్‌ ప్రిన్సిపల్‌ ప్రతాప్‌ ఉన్నారు.

రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ

భీమవరం(ప్రకాశంచౌక్‌): జిల్లాలో కుల ధ్రువీకరణ పత్రాల జారీ, ప్రభుత్వ భూమి ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై శనివారం స్థానిక ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఆడిటోరియంలో రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు చట్టాలు, నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. శిక్షణతో నైపుణ్యా లు పెంచుకోవాలన్నారు. ఏఐ టెక్నాలజీకి సంబంధించిన వివిధ టూల్స్‌ను ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు. కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.శివన్నారాయణరెడ్డి, పాలకొల్లు తహసీల్దార్‌ వై.దుర్గా కిషోర్‌ మాట్లాడారు.

ఏసీబీ వలలో

సబ్‌ ట్రెజరీ ఉద్యోగి

కై కలూరు: రిటైర్డ్‌ అ టెండర్‌కు రావాల్సిన సొమ్ములకు లంచం డిమాండ్‌ చేసిన కై కలూరు సబ్‌ ట్రెజరీ సీనియర్‌ అసిస్టెంట్‌ కులుకులూరి హనుమంతరావు అలియాస్‌ ఆంజనేయులను శనివారం ఏలూ రు ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు ఆధ్వర్యంలో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కై కలూరుకు చెందిన షేక్‌ సుభానీ 2016లో రెవెన్యూ అటెండర్‌గా రిటైరు కాగా శాలరీ ఫిక్స్‌ కాలేదు. ఇటీవల ఏలూరు ప్రధాన కార్యాలయం నుంచి కై కలూరు సబ్‌ ట్రెజరీకి ఆయన ఫైల్‌ను క్లియర్‌ చేసి పంపారు. ఏరియర్స్‌, గ్రాట్యూటీ కలిపి రూ.33 లక్షలు రావాల్సి ఉండగా.. కై కలూరు నుంచి ఫైల్‌ తిరిగి పంపడానికి సుభానీ మూ డు నెలలుగా హనుమంతురావు చుట్టూ తిరుగుతున్నారు. రూ.66 వేలు లంచం ఇవ్వాలని హనుమంతరావు డిమాండ్‌ చేయగా సుభానీ బతిమలాడితే రూ.55 వేలకు ఫైనల్‌ చేశాడు. జూన్‌ 26న రూ.10 వేలు ఇవ్వగా.. ఈనెల 2న సుభానీ ఖాతాలో పదవీ విరమణ లబ్ధి కొంత జమైంది. ఇంకా రూ.6 లక్షలు రావాల్సి ఉండగా.. ఆ మొత్తం కోసం రూ.20 వేలు లంచం ఇప్పుడు ఇచ్చి మిగిలింది తర్వాత ఇవ్వాలన్నాడు. దీనిపై ఈనెల 17న సుభానీ ఏలూరు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం రూ.20 వేలను సుభానీకి ఇచ్చి పంపగా.. ఈ సొమ్మును తీసుకుండుగా హనుమంతరావును రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని రాజమండ్రి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు.

ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ దారుణం 1
1/2

ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ దారుణం

ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ దారుణం 2
2/2

ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ దారుణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement