
మద్యం పాలసీకి చంద్రబాబే సూత్రధారి
పెంటపాడు: రాష్ట్రంలో మద్యం పాలసీకి సూ త్రధారి సీఎం చంద్రబాబేనని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. పెంటపాడులోని ఆర్యవైశ్య సేవా సంఘ భవనంలో ఆదివారం బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నాయకుల అరెస్టులను ఖండించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టు దారుణమని అన్నారు. అరెస్టులతో వైఎస్సార్ సీపీ నాయకులను కట్టడి చేయగలరా అని కూటమి నాయకులను ప్రశ్నించారు. రా ష్ట్రంలో మద్య నిషేధానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం ప్రయత్నించగా.. ప్రస్తుత కూటమి పాలనలో విచ్చలవిడిగా మద్యం దుకాణాల ఏర్పాటుతో ప్ర జల ఆర్యోగంతో ఆడుకుంటున్నారన్నారు. విచ్చలవిడి మద్యంతో ప్రజలు ఒళ్లు గుల్లచేసుకుని ఆస్పత్రుల పాలవుతున్నారన్నారు. అయినా ఎకై ్సజ్ సి బ్బంది పట్టించుకోవడం లేదన్నారు. అప్పులు చేసి తాగడం వల్ల కుటుంబాల్లో కలహాలు రేగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతుందని, రౌడీమూకలు రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలకు భారీ ప్రజాదరణ లభిస్తుండటం చూసి ఓర్వలేక ఆయనకు భద్రత విషయంలో కూ టమి ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదని కొట్టు విమర్శించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై జగన్ నిత్యం పోరాటం చేస్తూనే ఉంటారన్నారు. జగన్‌తో అనుబంధం ఉన్నవారందరినీ భయపెట్టి, కేసులు పెట్టి జైలులో పెట్టడం చంద్రబాబుకు, లోకేష్‌కు పరిపాటిగా మారిందన్నారు. అలాగే సంక్షేమం కోసం ప్రతిపక్షం ప్రశ్నిస్తుందని బాబుకు, పవన్‌కు భయం పట్టుకుందన్నారు. ప్రజలంతా కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్నారని, కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని కొట్టు అన్నారు.
మాజీ మంత్రి కొట్టు సత్యనారయణ