
ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ దారుణం
పెనుగొండ: రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలు సుంకర సీతారామ్, కోట వెంకటేశ్వరరావు అన్నారు. మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ ఆచంటలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆదివారం వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సీతారామ్, వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయ ప్రతీకారంతోనే మిథున్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిందని మండిపడ్డారు. మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేకపో యినా మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయాలనుకోవడం చంద్రబాబు కక్షపూరిత పాలనకు నిదర్శనం అన్నారు. కూటమి నాయకులు హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, దీంతో ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్‌లు చేస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతోనే వైఎస్సార్‌సీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నా రని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఎద్దేవాచేశారు. సర్పంచ్‌లు జక్కంశెట్టి చంటి, జక్కంశెట్టి శ్రీరామ్, పార్టీ రాష్ట్ర యూత్ జాయింట్ సెక్రటరీ కొవ్వూరి వేణుమాధవరెడ్డి, పిల్లి రుద్రప్రసాద్, మన్నె సుబ్బారావు, పెచ్చెట్టి సత్యనారాయణ, యల్లమెల్లి రాజేష్, బొరుసు రాంబాబు, దొమ్మెటి రాంబాబు, కేతా తాతారావు, గుబ్బల రామకృష్ణ, దొంగ దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.