
పేదల ఇళ్లు కూల్చివేత
ఆకివీడు: పేదల ఇళ్లను కూల్చివేశారు. ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని ధర్మాపుర అగ్రహారంలోని మంచినీటి చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణల తొలగింపునకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో శనివారం నగర పంచాయతీ కమిషనర్ ఆదేశాలతో పోలీసుల సమక్షంలో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. కాయకష్టంతో ఏళ్ల తరబడి శ్రమించి కట్టుకున్న తమ ఇళ్లు కూల్చివేయవద్దని బాధితులు మొ రపెట్టుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. కూల్చివేస్తున్న ఇళ్ల వద్దకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. బాధితులను లాగి పడేశారు. ఆకివీడు రూరల్ సీఐ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని 50 మంది సిబ్బంది, 10 మంది ఎస్సైల బందోబస్తులో ఆక్రమణల తొలగింపు పనులు సాగుతున్నాయి. బాధితుల్ని తొ లగింపు వద్దకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. చెరువు గట్టుపై ఉన్న సుమారు 26 ఇళ్లను తొలగించాల్సి ఉండగా కొన్నింటిని తొలగించారు. చీకటి ప డటంతో పనులను ఆపారు. కమిషనర్ కృష్ణమోహన్, తహసీల్దార్ ఎన్.వెంకటేశ్వరరావు, ఎస్సై హనుమంతురావు పనులను పర్యవేక్షిస్తున్నారు.