
మంచినీటి చెరువును పరిశీలించిన అధికారులు
కాళ్ల: కాళ్ల మండలం కోలనపల్లి రక్షిత మంచినీటి సరఫరా చెరువును అధికారులు శనివారం పరిశీలించారు. గ్రామంలో మంచినీటి చెరువులో చేపలు చనిపోవడంపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారంటూ శ్రీమంచినీటి చెరువులో చేపల మృతిశ్రీ అనే సాక్షి కథనానికి అధికారులు స్పందించారు. శనివారం ఉదయం డిప్యూటీ ఎంపీడీవో భాస్కరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పంచాయతీ అధికారులతో కలిసి చెరువును పరిశీలించారు. మంచినీటి చెరువులో చనిపోయి తేలుతున్న చేపలను తీసివేసి, చెరువు గట్ల చుట్టూ పెరిగిపోయిన చెత్త మొక్కలను మనుషులతో తొలగించినట్లు అధికారులు తెలిపారు. చెరువును బ్లీచింగ్‌తో సూపర్ శానిటేషన్ చేయించామని. ప్రజలంతా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని శ్రీటాంటాంశ్రీ వేయించామన్నారు. చెరువుకు కాళ్ళ లంక చానల్ నుంచి పూర్తిస్థాయిలో పంట నీరు నింపాలని అధికారులకు ఆదేశించారు.
పారిజాతగిరిలో పూజలు
జంగారెడ్డిగూడెం: గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో శనివారం వేకువజాము నుంచే సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్టి, బాల భోగ నివేదన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు జిల్లా నలుమూలల నుంచి కొండ పైకివచ్చి స్వామివారి ప్రత్యేక అష్టోత్తర పూజలు జరిపించుకున్నారు. ఆలయానికి విరాళం ద్వారా రూ.17,107, పూజా టిక్కెట్ల ద్వారా రూ.15,695, ప్రసాదాల ద్వారా 23,060 మొత్తం రూ.55,862 ఆదాయం వచ్చినట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి కలగర శ్రీనివాస్ తెలియజేశారు.
కుమార్తెలతో మహిళ అదృశ్యం
ఉండి: ఓ తల్లి ఇద్దరు బిడ్డలతో అదృశ్యం కావ
డంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం పెదపుల్లేరు గ్రామానికి చెందిన ఓ మహిళ భర్తతో విభేదాల కారణంగా తల్లి వద్ద ఉంటుంది. ఆమెకు 12, 8 ఏళ్ల వయసున్న కుమార్తెలు వున్నారు. ఈ నెల 18న ఇద్దరు కుమార్తెలతో నిద్రపోయిన ఆమె 19న ఉదయం 5 గంటల సమయంలో తల్లి చూసేసరికి కనిపించలేదు. దీంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మంచినీటి చెరువును పరిశీలించిన అధికారులు

మంచినీటి చెరువును పరిశీలించిన అధికారులు