
వైఎస్సార్‌కు ఘన నివాళి
పెనుగొండ: దివంగత సీఎం, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు దుబాయ్‌లో ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి దుబాయ్‌లో గోసంగి ధనలక్ష్మి, జుత్తిగ శ్రీను (భీమవరం శ్రీను), వైఎస్సార్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించి, కేక కట్ చేశారు. అనంతరం యూఏఈ వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు కాగితకుమార్, తరపట్ల మోహన్ మాట్లాడుతూ బడుగు బలహీన, మైనార్టీ వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిధి వైఎస్సార్ అని కొనియాడారు. కార్యక్రమంలో కటికతల ప్రకాష్, విజయ, సాంబార్ మణి, నాగమణి, ఆశీర్వాదం, ప్రసాద్, అశోక్, ఏసుబాబు, వంశీ, కోటి, ఆనంద్, నవీన్ పాల్గొన్నారు.
నరసాపురం–అరుణాచలం వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
నరసాపురం: చైన్నె–నరసాపురం మధ్య ప్రతిపాదనలో ఉన్న వందే భారత్ రైలును పట్టాలెక్కించే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. ప్రతి బుధవారం నరసాపురం నుంచి అరుణాచలం మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన రైలును మంత్రి జెండా ఊపి ప్రారంబించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త రైలు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పశ్చిమ డెల్టా నుంచి అరుణాచలం ప్రయాణించడానికి కొత్తగా ప్రవేశపెట్టిన ఈ రైలు ఉపయోగంగా ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వేస్టేషన్ మేనేజర్ మధుబాబు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు
భీమవరం: యువతను చెడుమార్గం పట్టించే మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తుల నిల్వలు కలిగి ఉన్నా, అక్రమంగా విక్రయించినా ఉపేక్షించేది లేదని, షాపు యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి హెచ్చరించారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమంలో భాగంగా పోలీ సులు బుధవారం జిల్లాలోని వివిధ విద్యాసంస్థల సమీపాన ఉన్న రిటైల్ దుకాణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులు, గుట్కా, ఇతర నిషేధిత మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల అమ్మకాలను నివారించమే ధ్యేయంగా ఆకస్మిక దాడులు చేయిస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో భాగంగా దుకాణాలలో విక్రయిస్తున్న నిషేధిత గుట్కా, పాన్, ఖైనీ వంటి హానికర ఉత్పత్తులు ధ్వంసం చేసి దుకాణ యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
జిల్లా రెడ్‌క్రాస్‌కు అవార్డు
భీమవరం (ప్రకాశంచౌక్): బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా 2022–2023 సంవత్సరానికి ఉత్తమ జిల్లా అవార్డు అందుకుంది. అవార్డును జిల్లా చైర్మన్ డా.భద్రిరాజు ఎంఎస్‌వీఎస్ గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు. రెడ్ క్రాస్ నిధుల సేకరణలో విశేష కృషి చేసిన వ్యవసాయ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, డీఆర్‌డీఎ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.ఎస్.ఎస్.వేణుగోపాల్, రిటైర్డ్ జిల్లా విద్యా అధికారి ఆర్.వి.రమణ మెడల్స్ అందుకున్నారు. కలెక్టర్, రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షురాలు సి.నాగరాణి జిల్లా రెడ్‌క్రాస్ టీంను అభినందించి, అవార్డు పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.

వైఎస్సార్‌కు ఘన నివాళి

వైఎస్సార్‌కు ఘన నివాళి