సాయంపై స్పష్టత కరువు | - | Sakshi
Sakshi News home page

సాయంపై స్పష్టత కరువు

Jul 6 2025 6:26 AM | Updated on Jul 6 2025 6:26 AM

సాయంప

సాయంపై స్పష్టత కరువు

భక్తుల రద్దీ సాధారణం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు అయినప్పటికీ ఆషాఢ మాసం కావడంతో రద్దీ తగ్గింది.

ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025

సాక్షి, భీమవరం: తొలకరి పనులు మొదలయ్యాయి. నారుమడి తయారీ నుంచి పంట చేతికందే వరకు ప్రతీది ఖర్చుతో కూడుకున్న పని. నారు నుంచి నాట్లు వేయడానికే ఎకరాకు రూ. 12 వేలు వరకు వెచ్చించాల్సిన పరిస్థితి. గత ఏడాది అన్నదాత సుఖీభవ సాయానికి ఎసరు పెట్టిన చంద్రబాబు సర్కారు ఈ సీజన్‌లో సాయం విడుదలపై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు జరగనుంది. 10,142 ఎకరాల్లో నారుమడులు సిద్ధం చేశారు. ముందుగా మాసూళ్లు జరిగిన తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం, తణుకు ప్రాంతంలో 10,212 ఎకరాల్లో నాట్లు వేశారు. పాలకొల్లు, ఉండి, కాళ్ల, ఆకివీడు, యలమంచిలి, నరసాపురం మండలాల్లో నారుమడులు సిద్ధం చేస్తున్నారు. నవంబరు చివరిలో వచ్చే తుఫాన్‌ల బారిన పడకుండా ఈపాటికే పనులు ముమ్మరం చేసి జూలై మూడో వారం నాటికి నాట్లు పూర్తిచేయాల్సి ఉంది. ప్రస్తుత జాప్యం నేపథ్యంలో ఆగస్టు నెల వరకూ నాట్లు పడే అవకాశం ఉంది.

పెట్టుబడుల కోసం ఇక్కట్లు : సార్వాలో నారుమడులు సిద్ధం చేసిన నాటి నుంచి నాట్లు వేసే వరకు నెల రోజుల వ్యవధిలో నారుమడికి విత్తనాలు, పంట దమ్ము, పార లంకలు, నేలను చదునుచేసేందుకు, ఎరువులు, నాట్లు వేసేందుకు కూలీ ఖర్చులు తదితర రూపాల్లో రూ.12,000 వరకు ఖర్చవుతుంది. రబీ సీజన్‌కు ధాన్యం బకాయిలు దాదాపు రూ.150 కోట్లు విడుదల చేయకపోగా, గత నాలుగేళ్లుగా లేని నీటి తీరువాను వడ్డీతో సహా ఇప్పుడే చెల్లించాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. మరోపక్క జూన్‌ 1నే కాలువలకు నీరు విడుదల చేసినా నెలాఖరు వరకు శివార్ల వరకు నీరు చేరలేదు. ఆయా కారణాలతో పెట్టుబడులకు చేతిలో సొమ్ముల్లేక సాగు ఆలస్యమవుతోంది.

గతంలో సాగుకు ముందే సాయం

గతంలో పెట్టుబడులు కోసం ఇబ్బంది పడాల్సిన పనిలేకుండా సాగు ప్రారంభానికి ముందే వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం రైతులకు సాయం అందించేది. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్‌ సాయం రూ.6000, రాష్ట్ర ప్రభుత్వం రూ.7500 జతచేసి ఏటా రూ.13,500 మొత్తాన్ని ఖరీఫ్‌ ప్రారంభానికి ముందు, కోతలు, రబీ ఆరంభంలో మూడు విడతలుగా అందించేవారు. తొలివిడతగా మే నెలలో రూ.7,500 రైతుల ఖాతాలకు జమచేసేవారు. పంట పెట్టుబడుల కోసం సన్న, చిన్నకారు రైతులకు ఈ సాయం ఎంతో ఉపయోగపడేది. గత ప్రభుత్వంలోని ఐదేళ్లలో జిల్లాలోని 1,17,999 మంది రైతులకు రూ.796.49 కోట్ల లబ్ధి చేకూరింది.

ఈకేవైసీతో సరి :తాము అధికారంలోకి వస్తే ఏటా రూ.20 వేల చొప్పున రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద సాయం చేస్తామని చెప్పిన కూటమి మొదటి ఏడాది సాయానికి ఎగనామం పెట్టింది. ప్రస్తుత సీజన్‌కు సాయం ఎప్పుడు విడుదల చేసేది ఇంకా స్పష్టత లేదు. సాయం విడుదల చేసే పేరిట జిల్లాలోని రైతులకు ఈకేవైసీ నిర్వహిస్తోంది. ఇంతవరకు 1,05,597 మందికి ఈకేవైసీ పూర్తి కాగా 355 మందికి చేయాల్సి ఉన్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. సాయం ఎప్పుడు విడుదల చేసేది స్పష్టత లేదంటున్నారు. తొలకరి పనులు ముమ్మరం కానున్న తరుణంలో పెట్టుబడులు పెట్టేందుకు చేతిలో సొమ్ములు లేక రైతులు దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది.

గురుకుల విద్య.. భద్రత మిథ్య

శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే గురుకుల విద్య తరగతులు నిర్వహిస్తుండడంతో ఏ క్షణాన ఏ భవనం కూలిపోతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 8లో u

తొలకరిలో సాగు పెట్టుబడులు (సుమారుగా)

విత్తనం ప్యాకెట్‌ రూ. 600

నారుమడి నిమిత్తం ఐదు సెంట్లలో దమ్ము, విత్తనాలు చల్లేందుకు, ఎరువుకు రూ.1,000

నాట్ల నిమిత్తం పొలాన్ని రెండు సార్లు దమ్ము చేసేందుకు రూ.3,000

పట్టి తోలేందుకు రూ.500

గట్లు చెక్కేందుకు ఇద్దరు కూలీలు రూ.1,400

నాట్లు వేసేందుకు కూలీలకు రూ.4,000

బస్తాన్నర యూరియా, డీఏపీ, 40 కేజీల పొటాష్‌కు రూ.2300, చల్లేందుకు కూలీ ఖర్చులు రూ.2100

కలుపు మందులు రూ.500, పురుగు మందులు రూ.2500, కూలీ ఖర్చులు రూ.2,100

పంట కోతకు రూ. 5,200

రవాణా, ఆరబెట్టేందుకు రూ.2,000, కూలీలు రూ.2,100

న్యూస్‌రీల్‌

జిల్లాలో మొదలైన తొలకరి పనులు

నారుమడి నుంచి నాట్ల వరకు ఎకరాకు రూ.12,000 వరకు పెట్టుబడి

అన్నదాత సుఖీభవ సాయం విడుదలపై సర్కారు మౌనం

రైతులకు ఈకేవైసీతో సరి

తొలి ఏడాది రూ.20,000 చొప్పున సాయానికి ఎగనామం

పంట పెట్టుబడుల కోసం రైతుల అవస్థలు

సకాలంలో సొమ్ములివ్వలేదు

పది ఎకరాల వరకు సాగు చేస్తున్నాను. దాళ్వా ధాన్యం డబ్బులు నెలన్నర రోజులకు పైనే అందక ఎరువుల దుకాణాలు, ఫైనాన్స్‌ వ్యాపారులకు వడ్డీలతో అప్పులు చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడే నీటితీరువా చెల్లించాల్సిన దుస్థితి. తొలకరి పెట్టుబడులకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నాం. అన్నదాత సుఖీభవ సాయం అందించి ఆదుకోవాలి.

– జంగా వెంకటరెడ్డి, రైతు, పెనుమంట్ర

ఎప్పుడు ఇచ్చేది ప్రకటించాలి

ప్రభుత్వం గత ఏడాది అన్నదాత సుఖీభవ సాయం విడుదల చేయక ఒక్కో రైతు రూ. 20 వేలు చొప్పున నష్టపోయాం. ఇప్పటికే తొలకరి పనులు మొదలయ్యాయి. ఈ సీజన్‌కు ను ఎప్పుడు విడుదల చేసేది ఇంకా చెప్పకపోవడం వల్ల రైతులు ఆందోళనకు గురికావాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో పనులు మొదలుకాకముందే సాయం విడుదల చేసేవారు.

– దేవరశెట్టి రాంబాబు, బి.కొండేపూడి, పెంటపాడు మండలం

సాయంపై స్పష్టత కరువు1
1/3

సాయంపై స్పష్టత కరువు

సాయంపై స్పష్టత కరువు2
2/3

సాయంపై స్పష్టత కరువు

సాయంపై స్పష్టత కరువు3
3/3

సాయంపై స్పష్టత కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement