
అగ్గిపుల్లపై అల్లూరి
ఏలూరు (టూటౌన్) : అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఏలూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు మేతర సురేష్ అగ్గిపుల్లపై ఆయన చిత్రాన్ని నిర్మించి అబ్బుర పరుస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఆయా నాయకుల చిత్రాలను తనదైన శైలిలో నిర్మించి నివాళులర్పించడం సురేష్‌కు పరిపాటి. ఈ క్రమంలోనే ఈ నెల 4వ తేదీ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రాన్ని అగ్గిపుల్లపై నిర్మించి నివాళి అర్పించారు.
ఏలూరులో ఈగల్ టీమ్ తనిఖీలు
ఏలూరు టౌన్ : గంజాయి, మత్తు పదార్థాల రవాణా అడ్డుకునేందుకు ఈగల్ టీమ్, రైల్వే పోలీస్, జిల్లా పోలీస్ సంయుక్తంగా గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏలూరు రైల్వే స్టేషన్‌లో ఈగల్ టీమ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవికృష్ణ స్వయంగా తనిఖీల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఈగల్ టీమ్ ఎస్పీ నాగేశ్వరరావు, ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు ఉన్నారు. ఏలూరు రైల్వే స్టేషన్‌లో విస్తృతంగా తనిఖీలు చేశారు. డాగ్ స్క్వాడ్‌తో రైల్వే స్టేషన్‌లో క్షుణ్ణంగా తనికీలు చేశారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌తో సహా పలు రైళ్ళలో తనిఖీలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్, రైల్వే పోలీస్ డీఎస్పీ రత్నరాజు, టూటౌన్ సీఐ అశోక్‌కుమార్, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎకై ్సజ్ సీఐ ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.

అగ్గిపుల్లపై అల్లూరి