
నాచు పెంపకంపై అవగాహన
భీమవరం: సముద్రపు నాచు (సీ వీడ్) పెంపకంపై నరసాపురం, మొగల్తూరులో మత్స్యకార మహిళా సంఘాలకు శిక్షణ ఇప్పించి అవగాహన కల్పించాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం మత్స్యశాఖ అధికారులతో సమీక్షించారు. 1100, పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలన్నారు. జిల్లా మ త్స్య శాఖ అధికారి ఆర్‌వీఎస్ ప్రసాదరావు, సహా య సంచాలకులు సీహెచ్ వెంకటేశ్వరరావు, ఎల్‌ఎన్ రాజు, ఎఫ్‌డీఓలు పాల్గొన్నారు.
సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి
జిల్లా జూనియర్, యూత్ రెడ్ క్రాస్ గ్రూపుల్లో విద్యార్థులు సభ్యత్వం తీసుకుని సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని జేసీ సూచించారు. కలెక్టరేట్ నుంచి ఎంఈఓలు, ప్రిన్సిపాళ్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.