
ఐఈఈఈతో జీవితం ఉన్నతం
తాడేపల్లిగూడెం: విద్యార్థులు తమ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం కోసం ఐఈఈఈ ఎంతగానో ఉపయోగపడుతుందని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పూర్వ జీఎం డాక్టర్ కప్పగంటు రామకృష్ణ తెలిపారు. ఏపీ నిట్‌లో బుధవారం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం, డీఎస్‌ఐఆర్, సీఆర్‌డీ హెచ్‌ఐ, ఈఈఈ నిట్ స్టూడెంట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో జాయింట్ చాప్టర్ వైజాగ్‌బే విభాగం సహకారంతో అధునాతన సాంకేతికతలు, భవిష్యత్ అవకాశాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్మార్ట్ ఎలక్ట్రికల్ గ్రిడ్‌లో ఎన్నో ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. వాటిని అందిపుచ్చుకొనేందుకు విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. రిజిస్ట్రార్, డీన్ ప్లానింగ్ దినేష్‌రెడ్డి, వి.సందీప్ మాట్లాడుతూ ఆధునిక పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్ధులు సాంకేతికతపై పట్టు సాధించాలన్నారు. ఐఈఈఈలో సభ్యత్వం తీసుకోవడం ద్వారా విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. ఆచార్యులు పి.శంకర్, కిరణ్‌తీపర్తి, వీరా కుమారి, మధు, దిలీప్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.
కాళ్ళకూరు వెంకన్న హుండీ ఆదాయం రూ.13 లక్షలు
కాళ్ల: కాళ్ళకూరు గ్రామంలో వేంచేసియున్న స్వయంభూః శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు బుధవారం స్వామి వారి హుండీ ఆదాయం లెక్కించారు. 58 రోజులకు గాను రూ:13,74,218 వచ్చినట్లు ఆలయ కార్వనిర్వహణాధికారి అరుణ్ కుమార్ తెలిపారు. గ్రామస్తులు, భక్తులు, మహిళా మండలి సభ్యులు దేవదాయ శాఖ తనిఖీదారు వర్ధినీడి వెంకటేశ్వరరావు సమక్షంలో హుండీ ఆదాయ లెక్కింపు కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు.
చోరీ కేసులో మరో నిందితుడి అరెస్ట్
పెనుగొండ: ఆచంట మండలం వల్లూరులో చోరీ కేసులో మరో నిందితుడు రాజమండ్రికి చెందిన యడ్ల వెంకటేష్‌ను అరెస్ట్ చేసినట్లు పెనుగొండ సీఐ రాయుడు విజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 2న వడ్లమన్నాటి భాస్కరరావు వెంకటలక్ష్మి దంపతులను వారి నివాసంలో నిందితులు కత్తితో బెదిరించి సుమారు రూ.9 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దొచుకెళ్లారు. దీనిపై వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి 5గురు నిందితులను ఈనెల 14న అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు వెంకటేష్‌ను రాజమండ్రిలోని అతడి నివాసంలోనే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడి నుంచి మంగళ సూత్రాలు, కొన పూసతో ఉన్న బంగారు బొందు, సుమారు నాలుగున్నర కాసుల బంగారం, వెండి చెంబు, వెండి పట్టీలు, మరికొంత వెండి స్వాధీనం చేసుకొన్నట్లు వివరించారు. కేసు త్వరితగతిన పురోగతి సాధించడానికి కృషి చేసిన డీఎస్పీ డాక్టర్ జి వేద, సీఐ రాయుడు విజయ్‌కుమార్, ఆచంట ఎస్సై కేవీ రమణను ఎస్పీ నయీం అస్మీ అభినందించారు.

ఐఈఈఈతో జీవితం ఉన్నతం

ఐఈఈఈతో జీవితం ఉన్నతం