
వివరాలు వెల్లడిస్తున్న ఈఓ కొండలరావు
సాక్షి, భీమవరం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు న్యాయ విభాగ జోనల్ ఇన్‌చార్జిగా సాధిక్ హుస్సేన్‌ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జిల్లా న్యాయ విభాగ అధ్యక్షుడిగా బడుగు అశోక్‌బాబును నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
23 నుంచి మద్దిలో పవిత్రోత్సవాలు
జంగారెడ్డిగూడెం రూరల్: గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి క్షేత్రంలో పవిత్రోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈఓ ఆకుల కొండలరావు తెలిపారు. గురువారం క్షేత్రంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 23 నుంచి 26 వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తామన్నారు. విష్వక్సేన పూజ, పుణ్యహవచనం, మృత్సంగ్రహణ, అంకురార్పణ, దీక్షాధారణ, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, కుంభ పూజ, శాంతి హోమాలు, చతుర్వేదద్యయనం, పవిత్ర ఆరోపణ, మహా పూర్ణాహుతి, దీక్ష విసర్జన వంటి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. పవిత్రోత్సవాలు పూర్తయ్యే వరకు గర్భాలయ దర్శనం నిలిపి వేస్తున్నట్టు చెప్పారు. మరలా ఈనెల 26న మధ్యాహ్నం 3 గంటల నుంచి గర్భాలయ పునఃదర్శనం ప్రారంభిస్తామన్నారు. అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.
డేటా ఎంట్రీ కోర్సులకు
స్కిల్ హబ్ శిక్షణ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 సంయుక్త ఆధ్వర్యంలో స్కిల్ హబ్ ద్వారా వట్లూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో అసో సియేటివ్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ (ఏడీడీ) ఆపరేటర్ కోర్సులకు స్వల్పకాలిక శిక్షణ ఇవ్వనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ పి.రజిత గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, శిక్షణ అనంతరం ఉపాధి కల్పించేందుకు పరిశ్రమల యా జమాన్యాలతో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకుందని పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ పూర్తి చేసి ఖాళీగా ఉన్న యువతను గుర్తించి వారికి హబ్‌లలో శిక్షణకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఎంఎస్ ఆఫీస్, టైపింగ్‌లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. 15 నుంచి 30 ఏళ్ల లోపు వారు అర్హులకు, కోర్సు కాలవ్యవధి మూడు నెలలు అని తెలిపారు. వివరాలకు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలోని స్కిల్‌హబ్ కో–ఆర్డినేటర్ కె.శ్యాం భూషణ్‌కుమార్‌ను సెల్ 8978524022లో సంప్రదించాలని కోరారు.
52 జాబ్‌మేళాలు.. 2,196 మందికి ఉపాధి
ఏలూరు (టూటౌన్): జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా ఈ ఏడాది ఆగస్టు వరకు 52 జాబ్‌మేళాలు నిర్వహించి 2,196 మందికి ఉపాధి కల్పించామని జిల్లా ఉపాధి అధికారి సి.మధుభూషణరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ కార్యాలయం ద్వారా రోజూ రిజిస్ట్రేషన్స్, రెన్యూవల్స్ జరుగుతున్నట్టు పేర్కొ న్నారు. ఏడాదికి 3 వేల మంది కొత్తగా నమోదు చేసుకుంటుండగా మరో 1,200 మంది రెన్యూవల్స్ చేసుకుంటున్నారని తెలిపారు. మొత్తంగా ఎన్‌సీఎస్ పోర్టల్ నందు ఈ ఏడాదిలో ఆగస్టు వరకు 11,906 మంది వివరాలు నమోదు చేశామని పేర్కొన్నారు. ప్రతినెలా తమ కార్యాలయంలో జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నామని, అలాగే ఏపీఎస్‌ఎస్‌డీసీ, సీడాప్ ద్వారా ఆయా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాలు నిర్వహించి పెద్ద ఎత్తున ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపా రు. 2021లో కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మోడల్ కెరీర్ సెంటర్‌ను మంజూరు చేసిందని, డైరెక్టర్ జనరల్ ఎంప్లాయిమెంట్‌ను నియమించారని పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచి ఈ కెరియర్ సెంటర్ నిరుద్యోగ యువతకు సేవలందిస్తుందన్నారు. అలాగే తమ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో కొత్త హాల్‌ను అన్ని సౌకర్యాలతో నిర్మించారని పేర్కొన్నారు. జాబ్‌మేళాల నిర్వహణకు అన్ని సౌకర్యాలు, వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.