
రొయ్య రైతుల అవగాహనా కార్యక్రమంలో మాట్లాడుతున్న నస్తా సీఈఓ దిలిత్ ఎక్కా
ఆకివీడు: రొయ్యల సాగులో యాంటీబయోటిక్స్ వాడకాన్ని నిషేధించాలని ఎంపెడా అధికారులు అన్నారు. స్థానిక ఫిషరీస్ కార్యాలయంలో ఎంపెడా ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నస్తా సీఈఓ దిలిత్ ఎక్కా, కేవీకే శాస్త్రవేత్తలు నిరజ తదితరులు మాట్లాడుతూ రొయ్యల సాగులో యజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. నాణ్యమైన మందులు వాడటం ద్వారా విదేశీ మార్కెట్‌లో మన రొయ్యలకు గిరాకీ పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం నాలుగో స్థానంలో మన ఎగుమతులు ఉన్నాయన్నారు. రొయ్యల సాగు నష్టాలను అధిగమించేందుకు నాణ్యమైన సీడు, ఫీడు వాడాలని సూచించారు. రొయ్యలకు ప్రత్యా మ్నాయ సాగుగా జిప్టీ థిలాఫియా, పండుగొప్ప, కొరమేనే వంటి ఇతరత్రా సాగును చేపట్టాలన్నారు. వీటి హేచరీలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.