
గేట్‌లో మెరిసిన ఏపీ నిట్ విద్యార్థులతో డీన్ అకడమిక్ కురుమయ్య తదితరులు
తాడేపల్లిగూడెం: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజినీరింగ్ (గేట్)లో ఏపీ నిట్ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో మెరిశారు. జాతీయ స్థాయిలో వీరు మంచి ర్యాంకులు సాధించారని నిట్ డీన్ అకడమిక్ డాక్టర్ టి.కురుమయ్య మంగళవారం తెలిపారు. సంస్థలో ఆఖరి సంవత్సరం చదువుతోన్న బొలిశెట్టి మణికంఠ సివిల్ ఇంజినీరింగ్‌లో రెండో ర్యాంకు, డి.సాయివెంకట్ బయోటెక్నాలజీలో 13వ ర్యాంకు, ఓరుగంటి రోహిత్ ఈసీఈలో 21వ ర్యాంకు, లుబుహిత్ బీషేన్ సివిల్‌లో 83వ ర్యాంకు, రామిరెడ్డి వెంకటసాయిరెడ్డి బయోటెక్నాలజీలో 93వ ర్యాంకు సాఽధించారు. మొత్తం 100 మంది విద్యార్థులు అర్హతసాధించగా, వీరిలో 100లోపు ర్యాంకులు ఐదుగురు, 1000లోపు ర్యాంకులు 20 మంది పొందారు. విభాగాల వారీగా బయోటెక్నాలజీలో ఎనిమిది, సివిల్‌లో 20, సీఎస్‌ఈలో 08, ఈఈఈలో 16, ఈసీఈలో 20, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 10, కెమికల్ ఇంజినీరింగ్‌లో 09, ఎంఎంఈలో తొమ్మిది ర్యాంకులు పొందారు. వీరిని ఉద్దేశించి డీన్ అకడమిక్ కురుమయ్య మాట్లాడుతూ విద్యార్థులకు అనుభవజులైన ఆచార్యులతో నాణ్యమైన, ఉత్తమమైన విద్యాబోధనను అందిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థల్లో కొలువులు సాధించడంతో పాటు, దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఈ ర్యాంకులు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. ఎస్సీ, ఎస్టీ సెల్ చైర్మన్ డాక్టర్ వినోత్‌కుమార్‌రాజా మాట్లాడుతూ సంస్థలో 2018 నుంచి ఏటా ఉచిత గేట్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులను నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ ప్రమోద్‌పడోలే, రిజిస్ట్రార్ దినేష్ పి.శంకరరెడ్డి అభినందించారు.