మైనర్‌ బాలికపై రెచ్చిపోయిన కామాంధులు

Minor Girl Brutally Murdered By Unknown - Sakshi

గిరిజన అమ్మాయిపై అఘాయిత్యం, హత్య

పట్టపగలే చోటు చేసుకున్న ఘాతుకం

ఉపాధి హామీ పనులకు వెళ్లి వస్తుండగా ఘటన

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో దారుణం

నేరస్తులని కఠినంగా శిక్షిస్తాం - మంత్రి సత్యవతి రాథోడ్‌

మహబూబాబాద్: ఉపాధి హామీ పనులకు వెళ్లిన బాలికపై దారుణానికి ఒడిగట్టారు మృగాళ్లు. దారికాచి మరీ దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆ బాలిక ప్రాణాలు బలి తీసుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలో జరిగిన ఈ ఘటన కామాంధుల కౄరత్వానికి పరాకాష్టగా నిలిచింది.

చేదోడువాదోడు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండా ధర్మారం గ్రామ శివారు సీతారాం తండాకు చెందిన ఓ మైనర్‌ బాలిక ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది. ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటోంది. తల్లిదండ్రులకు చేదోడు వాడోడుగా ఉండేందుకు ఉపాధి హామీ పనులకు వెళ్తోంది. పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కిరాణా దుకాణం వరకు వెళ్లి వస్తానంటూ చెప్పి బయటకు వెళ్లింది.

గుట్టల్లో శవమై
ఆ తర్వాత గంట సేపటికి గ్రామానికి సమీపంలో ఉన్న గుట్టల్లో తీవ్ర రక్తస్రావంతో అచేతంగా ఆ బాలిక పడిపోయి ఉందంటూ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గ్రామస్తులు ఆమె తండ్రికి సమాచారం అందించారు. అంతా గుట్టపైకి వెళ్లి చూడగా అప్పటికే ఆ మైనర్‌ బాలిక చనిపోయి ఉండడం చూసి బోరున విలపించారు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. 


లైంగికదాడి
తనకు నలుగురు ఆడపిల్లలని, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భార్య చనిపోయిందని ఆ మైనర్‌ బాలిక తండ్రి తెలిపాడు. అప్పటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన కూతురిపై అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగిక దాడి చేసి, దారుణంగా చంపేశాడని ఆయన ఆరోపించాడు.

కఠినంగా శిక్షించాలి- మంత్రి సత్యవతి రాథోడ్‌
మైనర్‌ బాలిక హత్య ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన నేరస్తున్ని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. పేదరికం నుంచి వచ్చి ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న అమ్మాయి పట్ల ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటం దారుణమన్నారు. ఇది క్షమించరాని నేరమన్నారు. బాధిత కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. 

దారుణం- మాలోతు కవిత ఎంపీ
గిరిజన బాలికపై అత్యాచారం.. హత్య సంఘటనను  మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్ కవిత ఖండిచారు. మహిళలపై ఇలాంటి దాడి జరగడం దారుణమన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు. 
 

Read latest Warangal News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

29-05-2021
May 29, 2021, 20:45 IST
లక్నో: కరోనా నుంచి కోలుకున్న ప్రజలను ఫంగస్‌ బయపెడుతుంది. ఇప్పటికే దేశంలో బ్లాక్‌, వైట్‌ ఫంగస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుండగా.....
29-05-2021
May 29, 2021, 19:40 IST
జైపూర్‌: కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్‌ ఉత్తమ మార్గమని ప్రభుత్వం చెబుతోంది. అలాంటి వ్యాక్సిన్‌ రెండు డోసుల మధ్య కొన్ని రోజులు...
29-05-2021
May 29, 2021, 18:00 IST
భోపాల్‌: కోవిడ్‌-19ను రాజకీయం చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కమల్‌ నాథ్‌పై మే 24న కేసు నమోదైన విషయం...
29-05-2021
May 29, 2021, 15:54 IST
ఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసులు రోజురోజుకు మరింత తగ్గుతున్నాయి. తాజాగా శనివారం 956 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సెకండ్‌...
29-05-2021
May 29, 2021, 15:48 IST
సాక్షి, అమరావతి: కరోనా కట్టడి కోసం తీవ్రంగా కృషి చేస్తోన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీడియాట్రిక్‌ కోవిడ్‌-19...
29-05-2021
May 29, 2021, 15:08 IST
కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ముత్యాలగూడెం గ్రామంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే ముగ్గురు...
29-05-2021
May 29, 2021, 14:32 IST
వెబ్‌డెస్క్‌: కరోనా ముప్పు ప్రపంచాన్ని ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. ఇప్పటికే కరోనా వేరియంట్స్‌తో అన్ని దేశాలు ఇబ్బందులు పడుతుంటే..... కొత్తగా కరోనా...
29-05-2021
May 29, 2021, 10:05 IST
రోజురోజుకు దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గుతున్నాయి. కరోనా కట్టడి చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. మరికొన్నాళ్లు ఇదే...
29-05-2021
May 29, 2021, 04:41 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 12 ఏళ్లలోపు చిన్న పిల్లలకు కోవిడ్‌–19 సోకితే అనుసరించాల్సిన చికిత్సా విధానం, నియంత్రించడం కోసం ఒక...
29-05-2021
May 29, 2021, 04:28 IST
సాక్షి, అమరావతి: దేశంలో అర్హులందరికీ సకాలంలో ఉచితంగా కోవిడ్‌ వ్యాక్సిన్లు వేయాలన్న లక్ష్యానికి ‘ప్రైవేటు సరఫరా’ గండికొడుతోంది. ఉత్పత్తి అవుతున్నవ్యాక్సిన్లలో...
29-05-2021
May 29, 2021, 03:49 IST
ముత్తుకూరు: కరోనా నివారణకు తాను తయారు చేసిన ఆయుర్వేద మందుపై అధ్యయనం జరుగుతుందని, ప్రభుత్వ అనుమతి రాగానే మందు పంపిణీ...
29-05-2021
May 29, 2021, 03:32 IST
సాక్షి, అమరావతి: మానవత్వం మరచి కోవిడ్‌ రోగుల వద్ద అధిక ఫీజులు దండుకునే ప్రైవేటు ఆస్పత్రులపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా...
29-05-2021
May 29, 2021, 03:17 IST
ప్రధాని మోదీ ఆడుతున్న నాటకాల వల్లే దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోందని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు.
29-05-2021
May 29, 2021, 03:04 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనాతో తల్లిదండ్రులిద్దరినీ లేదా   తల్లి, తండ్రిని కోల్పోయిన చిన్నారుల వివరాలు నమోదు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది....
29-05-2021
May 29, 2021, 03:00 IST
వైద్య రంగాన్ని మనం బలోపేతం చేస్తున్నాం. ప్రభుత్వాసుపత్రుల రూపు మారుస్తున్నాం. కొత్తగా హెల్త్‌ హబ్‌లు ఏర్పాటు చేస్తే అక్కడ ఏర్పాటు...
29-05-2021
May 29, 2021, 02:57 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ తీవ్రత క్రమేపీ తగ్గుముఖం పడుతున్నట్లు జాడలు కనిపిస్తున్నాయి. పాజిటివ్‌ కేసులు 44...
29-05-2021
May 29, 2021, 02:40 IST
కరోనా వైరస్‌ పుట్టిందెక్కడ? మరోసారి చక్కర్లు కొడుతున్న ప్రశ్న ఇది.
29-05-2021
May 29, 2021, 00:48 IST
ప్రవాసులు, హైనెట్‌ వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (హెచ్‌ఎన్‌ఐ), సంపన్న భారతీయులు ఎక్కువగా సెకండ్‌ హోమ్స్‌ను కొనుగోళ్లు చేస్తున్నారు.
29-05-2021
May 29, 2021, 00:31 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  దేశంలో స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్‌ బ్రాండ్‌ సంరక్షణ బాధ్యత తమ సంస్థకే ఉందని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌...
28-05-2021
May 28, 2021, 23:54 IST
ఈ కోవిడ్‌ సంక్షోభంలో ఒకరికొకరు సాయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు హీరోయిన్‌ శ్రుతీహాసన్‌. కోవిడ్‌ బాధితులకు, కోవిడ్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top