బియ్యం నాణ్యత పరిశీలన | - | Sakshi
Sakshi News home page

బియ్యం నాణ్యత పరిశీలన

Jun 21 2026 12:43 AM | Updated on Jun 21 2026 12:43 AM

న్యూశాయంపేట/ఖిలా వరంగల్‌: సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు హాస్టళ్లు, పాఠశాలలలు, రేషన్‌ దుకాణాల్లో పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అసిస్టెంట్‌ మేనేజర్‌ (టెక్నికల్‌) ఇర్ఫాన్‌, టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ జంగయ్య, వరంగల్‌ జిల్లా సివిల్‌ సప్లయీస్‌ టెక్నికల్‌ అసిస్టెంట్లు వినాయక్‌, రాజయ్య, డీటీసీఎస్‌ కిరణ్‌తో కూడిన బృందం శనివార ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్‌ ఈఎస్‌ఐ బాలికల హాస్టల్‌, తెలంగాణ మైనార్టీస్‌ హాస్టల్‌, జూనియర్‌ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా హస్టళ్లల్లో నిల్వ ఉన్న బియ్యం నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రిన్సిపాళ్లు, హాస్టల్‌ సిబ్బంది, విద్యార్థులతో మాట్లాడి బియ్యం నాణ్యత, వినియోగంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు, సంబంధిత అధికారులు బియ్యం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు బృందం సభ్యులు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన బియ్యం విద్యార్థులకు చేరేలా నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement