గ్రేటర్‌ వరంగల్‌లో విచ్చలవిడిగా వీధికుక్కల సంచారం ● రోజూ ఏదో ఒక చోట దాడి ఘటన | - | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ వరంగల్‌లో విచ్చలవిడిగా వీధికుక్కల సంచారం ● రోజూ ఏదో ఒక చోట దాడి ఘటన

Jun 20 2026 12:36 PM | Updated on Jun 20 2026 12:36 PM

– 8లోu పోర్టల్‌లో నమోదు తప్పనిసరి ‘హరిత కాకతీయ’లో నేడు సాంస్కృతిక వైభవం పెన్షనర్లకు అండగా ఉంటాం నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ రాక

న్యూస్‌రీల్‌

సాక్షి హెచ్చరించినా చలనం లేదు

కౌన్సెలింగ్‌కు సన్నద్ధం కావాలి

మహిళా డెయిరీ సేవలు ఆదర్శం

శనివారం శ్రీ 20 శ్రీ జూన్‌ శ్రీ 2026

తాజాగా శుక్రవారం వరంగల్‌ 18వ డివిజన్‌ లేబర్‌కాలనీ సమీపంలోని ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతానికి చెందిన అజయ్‌ కూతురు రెండేళ్ల వయస్సున్న పాయల్‌ ఆడుకుంటుండగా ఓ కుక్క తీవ్రంగా గాయపరిచింది. అనంతరం నోట కరచుకుని బయటికి పరుగెత్తింది. పక్కనే మైదానంలో క్రికెట్‌ ఆడుతున్న యువకులు కర్రలతో కొట్టడంతో పాపను విడిచిపెట్టింది. అప్పటికే ఓ మహిళను, ఆ తర్వాత అబీబ్‌ అనే ఐదేళ్ల బాలుడి వీపుపై తీవ్రగా గాయపర్చింది. పాప పాయల్‌ను ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు.

2023 మే 19న :

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ఉపాధి నిమిత్తం వలస వచ్చిన కుటుంబాలు కాజీపేట రైల్వే కాలనీలో చెట్ల కిందనే ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాయి. పక్కనే ఆడుకుంటున్న చోటు అనే ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుటుంబ సభ్యులు గమనించి అక్కడకు చేరుకునే లోపే బాలుడిని చంపేశాయి.

రామన్నపేట: హనుమకొండ జిల్లాలోని క్లినిక్‌లు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లు, హాస్పిటల్స్‌ తప్పనిసరిగా తెలంగాణ క్యాన్సర్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ ఎస్‌డీ రాంకుమార్‌ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం హనుమకొండలోని రెనోవా బన్ను క్యాన్సర్‌ హాస్పిటల్‌, అజర హాస్పిటల్‌, విజయ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌, రాడార్‌ డయాగ్నొస్టిక్‌ సెంటర్లను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ రాంకుమార్‌ మాట్లాడుతూ ల్యాబ్‌లు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లు నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, వ్యాధి నిర్ధారణ, రిపోర్టింగ్‌లో ఏమాత్రం నిర్లక్ష్యం చూపరాదన్నారు. అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ టి.మదన్‌మోహన్‌రావు, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌, జిల్లా మాస్‌ మీడియా అధికారి వి.అశోక్‌రెడ్డి, డీపీఓ రుక్ముద్దీన్‌, ఆస్పత్రుల డాక్టర్లు పాల్గొన్నారు.

హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక, సాంస్కృతిక శాఖ, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో సాంస్కృతిక వైభవాన్ని నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా పర్యాటక శాఖాధికారి ఎం.శివాజీ, హరిత కాకతీయ హోటల్‌ మేనేజర్‌ అశోక్‌రెడ్డి, కార్యక్రమాల సమన్వయకర్త కుసుమ సూర్యకిరణ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు (శనివారం) సాయంత్రం 6 నుంచి రాత్రి గంటల వరకు కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించే పేరిణి నృత్యం, చిందు యక్షగానం ప్రదర్శించనున్నుట్లు వివరించారు. పర్యాటకులు, కళాభిమానులు, నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

బీఆర్‌ఎస్‌ హనుమకొండ జిల్లా

అధ్యక్షుడు వినయ్‌భాస్కర్‌

కాజీపేట: పెన్షనర్స్‌ అసోసియేషన్‌ భవనాలకు ప్రైవేట్‌ వ్యక్తులు ఎటువంటి నష్టం చేయడానికి ప్రయత్నించినా తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి ఎదుర్కొంటానని బీఆర్‌ఎస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. కాజీపేట 62వ డివిజన్‌ రైల్వే పెన్షనర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో శుక్రవారం భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్‌ఆర్‌నగర్‌ కాలనీవాసులు, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరునూరైనా సరే పెన్షనర్లను ఎవరూ కదిలించలేరని, వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమైతే రాష్ట్ర, జిల్లా లీగల్‌ టీంలు ఉచితంగా న్యాయ సాయం చేస్తాయని తెలిపారు. దొంగే దొంగ అన్నట్లు తనపై అసత్య ఆరోపణలు చేసిన నాయకుడు ప్రస్తుతం చేస్తున్న పనిని ప్రజలు గమనించాలని కోరారు. పెన్షనర్స్‌ అసోసియేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సురేందర్‌నాథ్‌, ప్రధాన కార్యదర్శి మండలోజు కృష్ణమూర్తి, కె.అయ్యిలయ్య, లింగమూర్తి, సంజీవయ్య, కేవీ రావు, వెంకటనారాయణ, బీఆర్‌ఎస్‌ నాయకులు సుంచు కృష్ణ, నార్లగిరి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

హన్మకొండ అర్బన్‌: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌, ఐదుగురు కమిషన్‌ సభ్యులు శనివారం హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హనుమకొండ కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనుంది. భూవివాదాలు, అట్రాసిటి కేసులు, వివిధ శాఖల్లో రోస్టర్‌ పాయింట్ల అమలుపై కమిషన్‌ ప్రధానంగా దృష్టి సారించనుంది. సమావేశానికి జిల్లా అధికారులు పూర్తిస్థాయి నివేదికలు, తగిన సమాచారంతో హాజరుకావాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదేశించారు.

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో వీధికుక్కల బెడద ప్రాణాలు తీసేంతస్థాయికి వెళ్లింది. బల్దియా అధికారులు చేపడుతున్న తూతుమంత్రపు చర్యలతో వీటి బెడద ఏమాత్రం తీరడం లేదు. హనుమకొండ, వరంగల్‌, కాజీపేట ట్రైసిటీలోని సుభాష్‌నగర్‌, ఎన్‌యూఆర్‌ నగర్‌, మార్కెట్‌ ఏరియాతో పాటు నగరంలో సుమారు వంద చోట్ల సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో సుమారు 65 వేలవరకు వీధికుక్కలు ఉన్నట్లు అంచనా. సగటున రోజుకు 20–25 వరకు కుక్కకాట్ల కేసులు వివిధ ఆస్పత్రులకు వస్తున్నట్లు తెలుస్తోంది.

చెత్త నిర్వహణ లోపమే కారణమా?

నగరంలోని అనేక ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడం వల్ల కుక్కల సంఖ్య పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హోటళ్లు, మాంసం దుకాణాల వద్ద పడేసే వ్యర్థాలు వీధి కుక్కలకు ఆహారంగా మారుతున్నాయి. దీంతో అవి గుంపులుగా అక్కడే సంచరిస్తున్నాయి.

పట్టుకోవడం.. వదిలేయడమే వీరి పనా?

రైల్వే స్టేషన్‌, బస్‌స్టేషన్‌, ఆస్పత్రులు, రద్దీ ప్రాంతాలు, జన ఆవాసాల్లో కుక్కల సంచారం లేకుండా చర్యలు తీసుకోవాలని, వాటిని షెల్టర్‌ హోంకు తరలించాలని న్యాయస్థానాలు ఆదేశించినా బల్దియా అధికార యంత్రాంగం చొరవ తీసుకోవట్లేదు. ఫిర్యాదు వస్తే కాలనీల్లోకి వెళ్లి 15 నుంచి 20 కుక్కలను పట్టుకోవడం, శస్త్రచికిత్సలు నిర్వహించడం, ఐదు రోజుల తర్వాత తిరిగి అదే ప్రాంతంలో వదిలేయడం సర్వసాధారణమై పోయింది. కుక్కల పట్టివేత కార్యక్రమం కోసం వినియోగిస్తున్న వాహనాలకు రోజుకు సుమారు రూ.5 వేల వరకు డీజిల్‌ ఖర్చు చూపుతున్నట్లు కార్పొరేషన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నెలకు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ నగరంలో వీధి కుక్కల సంఖ్య తగ్గకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రజాధనంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పడమే తప్ప, వాటి ఫలితాలు ఏమిటో అధికారులు వెల్లడించడంలేదని ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు.

నగరవాసులు ఏమి కోరుకుంటున్నారంటే..

● వీధి కుక్కల సంఖ్యపై సమగ్ర సర్వే నిర్వహించాలి.

● స్టెరిలైజేషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేయాలి.

● చెత్త నిర్వహణను కట్టుదిట్టం చేయాలి.

● కుక్కల దాడులు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి.

● రేబిస్‌ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలి.

ఇటీవల కొన్ని ఘటనలు..

● మార్చి నెలలో వరంగల్‌ శివనగర్‌లోని నాలుగు జెండాల లేన్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఇద్దరు చిన్నారులపై దాడి చేసి గాయపర్చాయి.

● గత నెలలో వరంగల్‌ 18వ డివిజన్‌లోని చెన్నారెడ్డి కాలనీలో ఐదుగురిపై దాడి చేసి గాయపర్చాయి.

● ఈనెల 10న నగరంలోని 36వ డివిజన్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కాంపెల్లి వరమ్మ, రేణుకుంట్ల రమేష్‌, మహ్మద్‌ తాహి, గౌనియాపై దాడి చేయగా వారికి గాయాలయ్యాయి. వీరు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు.

..వెలుగులోకి వచ్చిన ఇలాంటివి కొన్ని ఘటనలే. రోజూ ఏదో ఒక చోట కుక్కకాట్ల బారిన పడుతున్నారు.

గ్రేటర్‌ పరిధిలోని వరంగల్‌, హనుమకొండ, కాజీపేటలో వీధి కుక్కలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ‘సాక్షి’ గతంలో హెచ్చరించినా వరంగల్‌ మహానగర పాలకసంస్థ నిర్లక్ష్యాన్ని వీడలేదు. పలు డివిజన్లలోని కాలనీల్లో వృద్ధులు, విద్యార్థులు, మహిళలు, బాలలపై శునకాలు దాడులు చేయగా తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందిన ఘటనలూ ఉన్నాయి. కుక్కల నియంత్రణకు జీడబ్ల్యూఎంసీ అధికారులు తీసుకుంటున్న నామమాత్రపు చర్యలు ఎటూ సరిపోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

రామన్నపేట: టీజీ ఈఏపీసెట్‌–2026 (ఎంపీసీ స్ట్రీం) కౌన్సెలింగ్‌కు విద్యార్థులు సన్నద్ధం కావాలని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, వరంగల్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ప్రిన్సిపాల్‌ పి.శ్రీనివాస్‌, కోఆర్డినేటర్‌ అండ్‌ సిస్టం అడ్మినిస్ట్రేటర్‌ ఎస్‌.రవీందర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా ఈనెల 19 నుంచి 28 వరకు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌ ప్రారంభమైనట్లు తెలిపారు. 22 నుంచి 29 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, 25 నుంచి జూలై ఒకటి వరకు వెబ్‌ఆప్షన్లు, జూలై 4న మాక్‌ సీట్ల కేటాయింపు, జూలై 5 నుంచి 7 వరకు ఆప్షన్లలో మార్పులు, 10న మొదటి దశ సీట్ల కేటాయింపు, 10 నుంచి 14 వరకు ఫీజు చెల్లింపు, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ఉంటుందని వారు పేర్కొన్నారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, అవసరమైన ధ్రువీకరణపత్రాలతో విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని, పూర్తి సమాచారం కోసం వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో సంప్రదించాలని సూచించారు.

పైలట్‌ ప్రాజెక్టుగా ములుగు జిల్లా..

85 నివాస ప్రాంతాలు, 2,020 ఇళ్లకు సౌకర్యం

రూ.17.03 కోట్లు విడుదల..

‘టీజీ రెడ్‌కో’ సౌజన్యంతో ఏర్పాట్లు

కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కమిటీ

సభ్యుడు డాక్టర్‌ శ్రీనివాస్‌

భీమదేవరపల్లి: మహిళా సాధికారతకు ముల్క నూరు మహిళా పరస్పర సహాయక సహకార డెయిరీ అందిస్తున్న సేవలు ఆదర్శమని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కమిటీ సభ్యుడు, సహకారరంగ నిపుణుడు డాక్టర్‌ ఎస్‌ఎల్‌ఎన్‌టీ శ్రీనివాస్‌ కొనియాడారు. శుక్రవారం ఆయన ముల్కనూరు మహిళా డెయిరీని సందర్శించి పలు కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ భాస్కర్‌రెడ్డితో కలిసి పాల సేకరణ, నాణ్యతా ప్రమాణాలు, మహిళా సభ్యుల భాగస్వామ్యం, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్‌ ఆర్థిక నిర్వహణ తదితర కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. డెయిరీ ఎండీ భాస్కర్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో డెయిరీకి సంబంధించిన శిక్షణ, డాక్యుమెంటేషన్‌, సామర్థ్య వృద్ధి, సంస్థాగత అభివృద్ధి కార్యక్రమాలకు సహకారాన్ని అందిస్తానని శ్రీనివాస్‌ హామీ ఇచ్చారు.

కనీస చర్యలు తీసుకోని బల్దియా యంత్రాంగం

తాజాగా రెండేళ్ల పాపను నోటితో

కరుచుకుని వెళ్లిన వీధికుక్క

తీవ్రగాయాలు.. పరిస్థితి విషమం

మూడేళ్లక్రితం ఓ బాలుడిని చంపిన శునకం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement