పాకాలలో అభివృద్ధి పనుల ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పాకాలలో అభివృద్ధి పనుల ప్రారంభం

Jun 19 2026 2:12 AM | Updated on Jun 19 2026 2:12 AM

వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

శిలాఫలకాలను ఆవిష్కరించిన

ప్రజాప్రతినిధులు, అధికారులు

ఖానాపురం: వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో రూ.1.82 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులను చేపట్టారు. వాటిని సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి శిలాఫలకాలను మహబూబాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు పోరిక బలరాంనాయక్‌, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్‌ సత్యశారద, డీఎఫ్‌ఓ భోగ నిఖిత, సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌, డీసీపీ అంకిత్‌కుమార్‌, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, గణేష్‌ ఆవిష్కరించారు. సఫారీ వాహనాలు, బ్యాటరీ వాహనాలను ప్రారంభించారు. బ్యాటరీ వాహనంలో బటర్‌ఫ్లై గార్డెన్‌కు వెళ్లి గార్డెన్‌లోని మొక్కలను వీక్షించారు. నూతనంగా ఏర్పాటు చేసిన పెడల్‌ బోట్లను ఎంపీ బలరాంనాయక్‌, ఎమ్మెల్యే మాధవరెడ్డి తొక్కుతూ సందడి చేశారు. అనంతరం పర్యావరణ అధ్యయన కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు రాంరెడ్డి, సంధ్యారాణి, కిష్టయ్య, నర్సంపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండెం లక్ష్మి, ఆర్డీఓ ఉమారాణి, ఎఫ్‌ఆర్వో నరేష్‌ బసవ, తహసీల్దార్‌ రమేష్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement