ఐనవోలు మల్లన్న ఆదాయం రూ.53.98 లక్షలు | - | Sakshi
Sakshi News home page

ఐనవోలు మల్లన్న ఆదాయం రూ.53.98 లక్షలు

Jun 19 2026 2:12 AM | Updated on Jun 19 2026 2:12 AM

ఐనవోలు మల్లన్న ఆదాయం రూ.53.98 లక్షలు

ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్‌ డివిజినల్‌ పరిశీలకురాలు నందనం కవిత పర్యవేక్షణలో గురువారం నిర్వహించారు. మార్చి 30 నుంచి జూన్‌ 18 వరకు హుండీ ద్వారా రూ.9,98,694, ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.43,99,767 సమకూరింది. మొత్తం రూ.53,98,461 నగదు సమకూరినట్లు ఆలయ ఈఓ కందుల సుధాకర్‌ తెలిపారు. హుండీల్లో లభ్యమైన మిశ్రమ వెండి, బంగారాన్ని యథావిధిగా హుండీలోనే వేసి సీల్‌ చేశామన్నారు. చైర్మన్‌ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్‌, కానిస్టేబుళ్లు కనకస్వామి, పరమేశ్వరి, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక సిబ్బంది, ఒగ్గు పూజారులు, కరీంనగర్‌కు చెందిన వెంకట అన్నమాచార్య ట్రస్ట్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement