హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని ‘కుడా’ ఆఫీస్ పక్కన నూతనంగా నిర్మించిన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వరంగల్ జోనల్ ల్యాబ్ సముదాయ భవనాన్ని గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి సేకరించిన వివిధ నమూనాలను విశ్లేషించడానికి ఈ జోనల్ ప్రయోగశాల ఏర్పాటు చేసినట్లు కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సునీత తెలిపారు. ప్రారంభోత్సవంలో మండలి సిబ్బంది పాల్గొన్నారు.
జూపార్కులో అభివృద్ధి పనులు..
న్యూశాయంపేట: హనుమకొండ హంటర్‌రోడ్డులోని కాకతీయ జూలాజికల్ పార్కులో సీసీ రోడ్డు పనులు, పక్షుల ఎన్‌క్లోజర్స్‌ను గురువారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా శాసనమండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి జూ పార్కులో మొక్కలను నాటారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, డీఎఫ్‌ఓ జూ క్యూరేటర్ బి.లావణ్య, అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు శ్యాంసుందర్, నాగేశ్వర్‌రావు, అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్లు శివకుమార్, జయసుధ, శ్వేత, సుగుణ, శారద, సిబ్బంది పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్) డిగ్రీ నాలుగు, ఆరో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతితో కలిసి గురువారం విడుదల చేశారు. నాలుగో సెమిస్టర్ పరీక్షలకు 1,030 మంది విద్యార్థులు హాజరుకాగా 573 మంది విద్యార్థులు (55.63 శాతం)ఉత్తీర్ణులయ్యారు. ఆరో సెమిస్టర్ పరీక్షలకు 663 మంది హాజరుకాగా 398 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ప్రిన్సిపాల్ జ్యోతి తెలిపారు. కేయూ ఓఎస్‌డీ బి.వెంకట్రాంరెడ్డి, ఓయూ మాజీ వీసీ ఎస్.సత్యనారా యణ, ఏవీఎస్ ప్రసాద్, అనిల్‌కుమార్, కళా శాల వైస్ ప్రిన్సిపాల్ రహమాన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీలత, వివిధ విభాగాల అధిపతులు రుక్కిరెడ్డి ఆదిరెడ్డి, శ్రీధర్‌కుమార్‌లోథ్, భిక్షపతి, హరికుమార్, స్వామి, ప్రసాద్, చందూలాల్, జయప్రకాశ్, బి.ప్రసాద్, పుల్లా రమేశ్, విజయ్‌కుమార్, నాగయ్య, సతీశ్, లక్ష్మారెడ్డి, సుధీర్, ప్రసాద్ పాల్గొన్నారు.
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో 23 మంది ఎస్సైలను బదిలీ చేస్తు పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.మౌనిక సుబేదారి మహిళా పోలీస్‌స్టేషన్ నుంచి కాజీపేట పీఎస్, ఎస్.కిరణ్మయి సీసీఆర్‌బీ నుంచి హనుమకొండ భరోసా కేంద్రం, సీహెచ్ లలిత సీపీటీసీ నుంచి జనగామ భరోసా కేంద్రం, తౌటం శ్రావణి పీసీఆర్ నుంచి కేయూసీ, డి.నిహారిక పీసీఆర్ నుంచి మిల్స్‌కాలనీ, వి.భవాని వీఆర్ నుంచి ఇంతేజార్‌గంజ్ పీఎస్, తుమ్మ శ్రావణి వీఆర్ నుంచి మిల్స్‌కాలనీ పీఎస్‌కు బదిలీ అయ్యారు. ఎన్.సాయిదివ్య వీఆర్ నుంచి హనుకొండ పీఎస్, కె.లక్ష్మీ వీఆర్ నుంచి సుబేదారి పీఎస్, బి.హరికృష్ణ సీపీటీసీ నుంచి సుబేదారి, సీహెచ్ రఘుపతి వీఆర్ నుంచి పరకాల పీఎస్, వి.గోవర్ధన్ వీఆర్ నుంచి ఏనుమాముల పీఎస్, ఎస్.రాజన్‌బాబు వీఆర్ నుంచి నర్సంపేట పీఎస్, బి.రవీందర్ వీఆర్ నుంచి గీసుకొండ పీఎస్, ఎల్.కొంరెల్లి హనుమకొండ ట్రాఫిక్ నుంచి సీసీఆర్‌బీకి బదిలీ అయ్యారు. ఎన్.రవికిరణ్ ఇంతేజార్‌గంజ్ పీఎస్ నుంచి సీీఎస్‌బీ, ఎస్.వెంకన్న సుబేదారి నుంచి సీఎస్‌బీ, షేక్ జాన్‌పాషా ధర్మసాగర్ నుంచి సీఎస్‌బీ, వి.నవీన్‌కుమార్ కాజీపేట పీఎస్ నుంచి సీఎస్‌బీ, బి.చందర్ టాస్క్‌ఫోర్స్ నుంచి సీసీఎస్, ఎం.రమేశ్ పరకాల నుంచి సీసీఆర్‌బీ, ఎల్.నరేశ్ మిల్స్ కాలనీ నుంచి సీసీఆర్‌బీ, పి.శ్రీనివాస్‌ను ఐనవోలు నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


