శాయంపేట: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని మైలారం సర్పంచ్ నూనె దివ్యతిరుపతి పేర్కొన్నారు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం తన కుమారుడిని చేర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. జయశంకర్ బడిబాటలో భాగంగా ఇటీవల ఎంపీడీఓ ఫణిచంద్ర, సర్పంచ్‌లు, ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఇచ్చిన మాట ప్రకారం తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచడానికి కృషి చేస్తానని, పాఠశాల అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మనోజ్‌కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మైలారం సర్పంచ్ నూనె దివ్యతిరుపతి
ప్రభుత్వ బడిలో తన కుమారుడిని
చేర్పించిన సర్పంచ్


