బల్దియా ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్ : నాలాల్లో తొలగించిన వ్యర్థాలను అక్కడే నిల్వ చేయకుండా, ఎప్పటికప్పుడు తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని బల్దియా ప్రత్యేకాధికారి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్.. ఇంజనీర్లను ఆదేశించారు. నాలాల్లో పూడికతీత, నిర్వహణలో నిర్లక్ష్యంపై ఈనెల 11న ‘సాక్షి’లో నాలాతీత.. నిధుల మేత’శీర్షికన ప్రచురితమైన వా ర్తకు స్పందించారు. మంగళవారం ఆమె జవహర్ కాలనీ, ప్రెసిడెంట్ స్కూల్, రాజాజీ నగర్, నయీంనగర్ ప్రాంతాల్లోని నాలాలను తనిఖీ చేశారు.


