ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవ పూజలు | - | Sakshi
Sakshi News home page

ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవ పూజలు

Jun 16 2026 1:34 AM | Updated on Jun 16 2026 1:34 AM

ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవ పూజలు

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి ఆలయంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవ పూజలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారి ఆజ్ఞ తీసుకుని అనంతరం పూర్వంగవిధి, యాగశాల ప్రవేశం చేశారు. సర్వతోభద్రమండల రచన, దేవతాహ్వానం, మూలమంత్రనుష్టాన హోమాలు, కుటీర హోమం, జలాధివాసం చేశారు. కార్యక్రమంలో కుడా చైర్మన్‌ వెంకట్రాంరెడ్డి, ఎస్‌ఈ ఇరిగేషన్‌ హరివెంకటరామ ప్రసాద్‌, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ బండారు శివసుబ్రహ్మణ్యమ్‌, ధర్మకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement