వరంగల్ అర్బన్: ‘కాలనీల్లో సమస్యలతో సతమతమవుతున్నాం. సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి పైప్‌లైన్లు, ఆక్రమణలు తదితర సమస్యలపై అనేకసార్లు ఫిర్యాదులు చేశాం. స్థానిక సమస్యలను పరిష్కరించరా?’ అని గ్రేటర్ వరంగల్ అధికారులను నగర ప్రజలు నిలదీశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్‌లో జరిగిన గ్రీవెన్స్ సెల్‌లో అడిషనల్ కమిషనర్ ఇసంపెల్లి జోనా, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
టౌన్ ప్లానింగ్‌కు 41, ఇంజనీరింగ్ సెక్షన్‌కు 24, రెవెన్యూ విభాగానికి 7, హెల్త్, శానిటేషన్‌కు 10, తాగునీటి సరఫరా కోసం 3 రాగా, మొత్తం 85 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ శంకర్ లింగం, పన్నుల అధికారి రామకృష్ణ, ఎంహెచ్‌ఓ రాజేశ్, సెక్రటరీ అనిల్ బాబు, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి, ఈఈ సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులను నిలదీసిన నగర ప్రజలు
గ్రేటర్ గ్రీవెన్స్‌కు 85 ఫిర్యాదులు


