● ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి
● కోటలో ఘనంగా కాకతీయుల నృత్య కళావైభవం
ఖిలా వరంగల్: కాకతీయుల ఘన కీర్తి, సామ్రాజ్య కళా వైభవాన్ని ప్రపంచానికి చాటుదామని వరంగల్ ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి ఖిలా వరంగల్ మధ్యకోట ఖుష్‌మహల్ మైదానంలో అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక, పర్యాటక శాఖ సహకారంతో కాకతీయ కళావైభవం,కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డు నమోదు కో సం కళాకారుల జాతీయ స్థాయి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాకతీయుల కీర్తి ప్రతిష్టలు పెంచేలా శాసీ్త్రయ నృత్యాలు ప్రదర్శించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కామిశెట్టి రాజు, ఎండీ సిరాజుద్దీన్ రంజిత్‌కుమార్, ఎస్‌కే బాబర్, ప్రొఫెసర్ నరసింహమూర్తి, విజయ్‌బాబు, పగడాల సరళ, రవికుమార్, కృష్ణారావు, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
ఖిలావరంగల్ మధ్యకోటలో అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కాకతీయుల వైభవంపై నృత్య ప్రదర్శన నేత్రపర్వంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. నృత్య కళాకారులు సామూహికంగా చేపట్టిన సాంస్కృతిక నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.


