నాలుగున్నర ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశా. ప్రైవేట్‌కు పోను మిగిలిన 88 క్వింటాళ్ల మొక్కజొన్నలను నెలరోజుల క్రితం రాయపర్తి మండల కేంద్రంలోని మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రంలో అమ్మిన. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పుడు పెట్టుబడి పెట్టేందుకు ఆ డబ్బులు ఎంతో అవసరం. అవి వస్తే పంటల సాగు నాకు సులభం అవుతుంది. లేదంటే అప్పులు తేవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సాధ్యమైనంత త్వరగా బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం డబ్బులు జమ చేయాలి.
–రాహుల్ యువరైతు, బంధనపల్లి, రాయపర్తి మండలం


