‘బెస్ట్‌ అవైలబుల్‌’కు విద్యార్థుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

‘బెస్ట్‌ అవైలబుల్‌’కు విద్యార్థుల ఎంపిక

Jun 12 2026 7:25 AM | Updated on Jun 12 2026 7:25 AM

ఆర్‌ఎంగా కిషన్‌రావు

న్యూశాయంపేట: బెస్ట్‌ అవైలబుల్‌ స్కీంలో భాగంగా ప్రైవేట్‌ స్కూళ్లలో చదువుకోవడానికి కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్‌ సత్యశారద డ్రా పద్ధతిలో ఎస్సీ విద్యార్థులను ఎంపిక చేశారు. జిల్లాలోని 8 స్కూళ్లలో మొత్తం 122 సీట్లు (60 నాన్‌ రెసిడెన్షియల్‌, 62 రెసిడెన్షియల్‌) ఉన్నాయి. ఒకటో తరగతి 60 సీట్లకు 103 దరఖాస్తులు రావడంతో డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. 5వ తరగతిలో 62 సీట్లకు 44 దరఖాస్తులు మాత్రమే రావడంతో అందరిక ఎంపిక చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఎంపికై న విద్యార్థులకు ఒకటో నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమాధికారి భాగ్యలక్ష్మి, ఏఎంఓ సుజన్‌తేజ, ఎంఈఓలు, కమిటీ సభ్యులు, ఎస్సీ సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

కాళోజీ సెంటర్‌: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఇంటర్‌ బోర్డు అధికారులు గురువారం విడుదల చేశారు. ప్రథమ సంవత్సరం జనరల్‌కు 3,263 మంది విద్యార్థులు హాజరుకాగా 1,913 మంది, ఒకేషనల్‌లో 329 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 245 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం జనరల్‌కు 2,082 మంది హాజరు కాగా 1,201 మంది, ఒకేషనల్‌ 183 మందికి 98 మంది ఉత్తీర్ణులయ్యారు.

ఉచిత శిక్షణకు

దరఖాస్తుల ఆహ్వానం

న్యూశాయంపేట: కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌–2 (సీడీఎస్‌–2026) పరీక్షకు సన్నద్ధమవుతున్న ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు, బౌద్ధ, పార్సీ, జైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వరంగల్‌ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్‌, హనుమకొండ జిల్లా ఇన్‌చార్జి మైనారిటీ సంక్షేమాధికారి మేన శ్రీను గురువారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 15లోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 9059050062 నంబర్‌లో గాని వరంగల్‌ జిల్లా అభ్యర్థులు హనుమకొండ సుబేదారి షరీఫన్‌ మసీద్‌ ఎదుట ఉన్న కార్యాలయంలో, హనుమకొండ జిల్లా అభ్యర్థులు హనుమకొండ సుబేదారి కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ రెండో అంతస్తులో ఉన్న కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

ఆర్టీసీ వరంగల్‌ డిప్యూటీ

హన్మకొండ: టీజీఎస్‌ ఆర్టీసీ వరంగల్‌ డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ (మెకానికల్‌)గా టి.కిషన్‌రావు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేస్తున్న పి.మహేశ్‌ హైదరాబాద్‌కు బదిలీ కాగా, ఆయన స్థానంలో టి.కిషన్‌రావు వచ్చారు. గురువారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

కంటి దవాఖానా సూపరిం

టెండెంట్‌గా రవిశేఖర్‌రావు

కాశిబుగ్గ: వరంగల్‌ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ కె.రవిశేఖర్‌రావును నియమించారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ఆప్తాల్మజీ విభాగం (నేత్ర వైద్య విభాగం) హెచ్‌ఓడీగా పనిచేసిన ఆయన బదిలీపై వరంగల్‌కు వచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన భరత్‌కుమార్‌ భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు బదిలీ అయ్యారు.

14న జిల్లా స్థాయి ఓపెన్‌ టు ఆల్‌ చెస్‌ పోటీలు

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 14న కల్నల్‌ సంతోశ్‌బాబు స్మారక ఓపెన్‌ టు ఆల్‌ చదరంగం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహణ కార్యదర్శి కన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలను హనుమకొండ రెడ్డి కాలనీలోని మాస్టర్జీ వికాస్‌ హై స్కూల్‌ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అండర్‌–10, 12, 14 బాలబాలికల విభాగం నుంచి ఇద్దరి చొప్పున రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జూలై 11, 12 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ స్థాయి రాపిడ్‌ రేటింగ్‌ చదరంగ పోటీలకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement