జాయింట్‌ సర్వేతో సమస్య పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

జాయింట్‌ సర్వేతో సమస్య పరిష్కారం

Jun 12 2026 7:19 AM | Updated on Jun 12 2026 7:19 AM

జాయింట్‌ సర్వేతో సమస్య పరిష్కారం

ఎస్సారెస్పీ డీఈ వేణుగోపాల్‌

శాయంపేట: మండలంలోని మైలారం గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నంబర్‌ 35లో 25 ఏళ్ల క్రితం రైతులకు సాగునీరందించేందుకు అప్పటి ప్రభుత్వం డీబీఎం–31 ఆర్‌ ఎస్సారెస్పీ కాలువ నిర్మాణం చేపట్టి ఇందుకోసం 25 గుంటల భూమిని పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుంది. ఆభూమిని కొంత మంది రైతులు ఆక్రమించుకున్నట్లు ఫిర్యాదు రావడంతో గురువారం ఎస్సారెస్పీ డీఈ వేణుగోపాల్‌, ఏఈ వాసంతి, సివిల్‌ ఇంజనీర్‌ అరవింద్‌ ఎస్సారెస్పీ భూమిని సర్వే చేశారు. కాలువకు సంబంధించిన డ్రాప్‌ ప్రాంతాన్ని వెలికితీసి హద్దులను గుర్తిస్తూ మార్కింగ్‌ చేసి గుర్తించిన మార్గం వెంట గతంలో నిర్మించిన ఎస్సారెస్పీ కాలువకు లైనింగ్‌ పనులు చేపట్టారు. ఈసందర్భంగా డ్రాప్‌ నకు ఎగువ భాగంలో ఉన్న కొంత మంది రైతులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. రెవెన్యూ అధికారులతో కలిసి జాయింట్‌ సర్వే నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామని డీఈ వేణుగోపాల్‌ తెలిపారు.

నక్ష ప్రకారం కాలువ తీసి నీరందించాలి..

మైలారం గ్రామ రెవెన్యూ పరిధిలో గత 25 ఏళ్ల క్రితం రైతులకు సాగునీరందించేందుకు సర్వే నంబర్‌ 35లో 20 గుంటల భూమి ఎస్సారెస్సీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కొంత మంది రైతులు కాలువ మార్గాన్ని పూడ్చేయడంతో కింది భాగంలో ఉన్న భూములకు సాగునీరు చేరడం లేదు. నక్ష ప్రకారం కాలువ తీసి నీరు అందించాలి. – అర్జల సాంబరెడ్డి, రైతు, మైలారం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement