గ్రామ పంచాయతీ స్థలం ఆక్రమణ | - | Sakshi
Sakshi News home page

గ్రామ పంచాయతీ స్థలం ఆక్రమణ

Apr 8 2026 8:26 AM | Updated on Apr 8 2026 8:26 AM

నెక్కొండ: అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు నాగారంలో గ్రామ పంచాయతీ స్థలాన్ని అక్రమించి, ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపడుతున్న సంఘటనపై గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మండల కేంద్రంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. గ్రామ పంచాయతీ స్థలంలో కొన్నేళ్లుగా దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు. పక్కనే జాతీయ జెండా గద్దె, నల్లా ట్యాంకు ఉంది. ఆ స్థలం పక్కనే గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు కర్కాల మల్లారెడ్డి ఇల్లు ఉంది. ఆయనకు ఉన్న స్థలంతోపాటు గ్రామ పంచాయతీ స్థలంలోని గద్దెను, నల్లా ట్యాంకును కూల్చాడు. ఆక్రమించిన స్థలంలో ఏకంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని చేపట్టాడు. గ్రామస్తులు ఇంటి నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గత నెల 23న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ స్పందించి విచారణకు డీపీఓను ఆదేశించారని వారు విలేకరులకు వివరించారు. విచారణ చేసి వారం రోజుల్లో నివేదిక అందజేయాలని ఎంపీఓ దయాకర్‌కు.. డీపీఓ ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. విచారణ అధికారి పూర్తిస్థాయిలో విచారణ చేసి ఆక్రమణకు పాల్పడిన మల్లారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. మాజీ సర్పంచ్‌ శీలం వెంకన్న, కేతిరెడ్డి స్వామిరెడ్డి, పిచ్చయ్య, యాకూబ్‌రెడ్డి, ఉప్పల సాంబయ్య, కూరపాటి నగేశ్‌, రాయపురం ఉప్పలయ్య, జంగిలి రాములు తదితరులు పాల్గొన్నారు.

దర్జాగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..

నాగారంలో కాంగ్రెస్‌ నాయకుడి నిర్వాకం

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement