‘సర్‌’ను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ను వేగవంతం చేయాలి

Apr 5 2026 7:24 AM | Updated on Apr 5 2026 7:24 AM

న్యూశాయంపేట: సర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌)ను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌ నుంచి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ జిల్లాలో బీఎల్‌ఓలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 58 శాతం మ్యాపింగ్‌ పూర్తయ్యిందని, వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో మాత్రమే కొంత పెండింగ్‌ ఉందని పేర్కొన్నారు. అలాగే, డెమోగ్రాఫికల్‌ సిగ్నల్స్‌ ఎంట్రీలో 290 పెండింగ్‌ ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, వరంగల్‌ ఆర్డీఓ సుమ, తహసీల్దార్లు పాల్గొన్నారు.

ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శిని

కలిసిన కలెక్టర్‌

నగరానికి శనివారం వచ్చిన రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ను కలెక్టర్‌ సత్యశారద మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. అనంతరం జిల్లాలో విద్యుత్‌ సరఫరా, అభివృద్ధి పనులపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement