ఉద్యోగ విరమణతో కొత్త జీవనం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ విరమణతో కొత్త జీవనం

Apr 2 2026 7:17 AM | Updated on Apr 2 2026 7:17 AM

ఉద్యోగ విరమణతో కొత్త జీవనం

హన్మకొండ అర్బన్‌: సుదీర్ఘకాలం ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేసిన అధికారులు, ఉద్యోగులకు ఉద్యోగ విరమణ అనేది ముగింపు కాదని, కొత్త జీవనానికి శ్రీకారం అని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాలరాజు, కలెక్టరేట్‌ ఉద్యోగి సమ్మయ్యను కలెక్టర్‌ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రవి, అధికారులు, సహోద్యోగులు పాల్గొ ని ఉద్యోగ విరమణ పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.

గ్రామ సభలను విజయవంతంగా

నిర్వహించాలి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామసభల ద్వారా ప్రజలకు విస్తృతంగా తెలియజేసి, విజయవంతంగా అమలు చేయాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌ పాయ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి జిల్లాలోని అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో నేడు (గురువారం) నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల ఏర్పాట్లపై సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్‌, మున్సిపల్‌ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.

మౌలిక వసతులు కల్పించాలి

కాజీపేట అర్బన్‌: న్యూశాయంపేటలోని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లలో మౌలిక వసతుల కల్పన వేగంగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. కాజీపేట మండలం న్యూశాయంపేటలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను బుదవారం కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ ఆకస్మికంగా చేశారు. మౌలిక వసతులు, అభివృద్ధి పనులను పది రోజుల్లో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీఓ రమేశ్‌రాథోడ్‌, జీడబ్ల్యూఎంసీ సీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ సురేశ్‌బాబు, పీడీ సిద్ధార్థ్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement