నర్సంపేట రూరల్: దాడి కేసులో ఒకరిని రిమాండ్ చేసినట్లు నర్సంపేట టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డులో వేద స్కానింగ్ సెంటర్‌కు డాక్టర్ ములుగు సతీశ్ రెఫర్ చేయగా.. ఒక యువతికి స్కానింగ్ చేసి రిపోర్టు ఇచ్చారు. ఆ రిపోర్టు తప్పుగా ఇచ్చారని మార్చి 22న యువతి కుటుంబ సభ్యులు నలుగురు స్కానింగ్ సెంటర్ వద్దకు వచ్చి డాక్టర్‌పై దాడిచేశారు. దాడి చేసిన మోడెం విద్యాసాగర్‌పై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.


