కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని గణితశాస్త్ర విభాగం పరిశోధకుడు అభిలాష్ వొల్లలకు యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రకటించింది. పరఫార్మెన్స్ అనాలిసిస్ ఆఫ్ ఇంటర్నెట్ రూటర్ విత్ సిమిలర్ ఇన్‌పుట్ ట్రాఫిక్ ట్రాన్సియంట్ క్వియింగ్ సిస్టమ్ విత్ మార్కోవియన్ మోడెల్ల్‌డ్ ఇన్‌పుట్ ప్రాసెస్ అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్దాంత గ్రంథానికి గాను అభిలాష్‌కు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ తెలిపారు. గణిత విభాగం ఆచార్యులు పి.మల్లారెడ్డి పర్యవేక్షణలో అభిలాష్ తన పీహెచ్‌డీ పూర్తిచేశారు.


