భద్రకాళి ఆలయానికి నూతన ధ్వజస్తంభం | - | Sakshi
Sakshi News home page

భద్రకాళి ఆలయానికి నూతన ధ్వజస్తంభం

Apr 1 2026 7:18 AM | Updated on Apr 1 2026 7:18 AM

భద్రకాళి ఆలయానికి నూతన ధ్వజస్తంభం

హన్మకొండ కల్చరల్‌ : భద్రకాళి దేవాలయంలో 50 అడుగుల నూతన ధ్వజస్తంభం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు మంగళవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ వద్ద గల వెంకటాపురం ఫారెస్ట్‌ రేంజ్‌ జోన్‌లో సుమారుగా 50 ఫీట్ల ఎత్తుతో తెలంగాణ ప్రాంతంలో అత్యంత అరుదుగా దొరికే నార వేప కర్రను ఎంచుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తలు గాదె శ్రవణ్‌కుమార్‌, మోత్కురి మయూరి, ఓరుగంటి పూర్ణచందర్‌, జారతి వెంకటేశ్వర్లు, పాలడుగుల ఆంజనేయులు పరిశీలించారు. ధ్వజస్తంభం 20రోజుల్లో ఆలయానికి చేరేలా చర్యలు తీసుకుంటామని ధర్మకర్తలు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement