రోడ్డెక్కిన ఆశ వర్కర్లు | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన ఆశ వర్కర్లు

Mar 31 2026 7:20 AM | Updated on Mar 31 2026 7:20 AM

రోడ్డెక్కిన ఆశ వర్కర్లు

పరకాలలో నిరసన ర్యాలీ, ధర్నా

పరకాల: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన కనీస వేతనం అమలు చేయాల్సింది పోయి.. ఉన్న జీతాలను మూడు నెలలకోసారి ఇవ్వడంతో ఆర్థిక ఇబ్బందులతో తప్పడంలేదని బీఆర్‌టీయూ ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారి మంజుల ఆందోళన వ్యక్తం చేశారు. చలో హైదరాబాద్‌కు అనుమతి ఇచ్చిన పోలీసులు జిల్లాల వారీగా ఎక్కడిక్కడే అరెస్టులు చేయడం అన్యాయమంటూ పరకాల అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి బస్టాండ్‌ వరకు సోమవారం నిరసన ర్యాలీ, ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా మంజుల మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రేవంత్‌డ్డి ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయని మండిపడ్డారు. ప్రతీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో, ఎన్నికల్లో ఆశవర్కర్లు సేవలందిస్తున్నా.. తమను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం తమకిచ్చిన హామీలను అమలు చేయని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యడ ప్రేమలత, పీహెచ్‌సీ అధ్యక్షురాలు పి.సునీత, ఎం.రమాదేవి, లావణ్య, శైలజ, రమాదేవి, సునీత, అనిత, స్వప్న, విజయ, సుజాత, వనమాల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement