వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Mar 31 2026 7:14 AM | Updated on Mar 31 2026 7:14 AM

మంగళవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2026

జనగణనను సమర్థవంతంగా నిర్వహించాలి

న్యూశాయంపేట: జనగణన 2027 మొదటి విడతలో చేపట్టనున్న ఇళ్ల గణనను సమర్థవంతంగా నిర్వహించాలని జనగణన సంచాలకుడు భారతీ హోలీకేరి సూచించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జనగణన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జనగణన, ఇళ్ల గణన, మ్యాప్‌ తయారీ, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల నియామకంపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు, ఆర్‌డీఓలు, సీపీఓ, మున్సిపల్‌ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.

హజ్‌ యాత్రికులకు వ్యాక్సినేషన్‌

హజ్‌ యాత్రికులు సురక్షితంగా తమ ప్రయాణాన్ని పూర్తి చేసుకోవాలని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. సోమవారం ఐఎంఏ హాల్‌లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా హజ్‌ కమిటీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. యాత్రికులు అవసరమైన ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మొత్తం 64 మంది యాత్రికులు ఫిట్‌నెస్‌ పొందగా, వారిలో 58 మంది యాత్రికులకు టీకా వేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ ప్రకాష్‌, జిల్లా హజ్‌ కమిటీ అధ్యక్షుడు సర్వర్‌మోహియోద్దీన్‌, మెంబర్‌లు సయ్యద్‌ ఫైజుల్లా, అఫ్జల్‌ మోహియోద్దీన్‌, అజీమ్‌, డాక్టర్‌ ఉమర్‌, గులామ్‌హుస్సేన్‌, తదితరులు పాల్గొన్నారు.

స్వశక్తితో ఎదగడమే ధ్యేయం

నర్సంపేట: స్వశక్తితో ఎదిగేలా చేయడమే ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల ప్రధాన ధ్యేయమని జిల్లా బాలల సంక్షేమ అధికారి ఉమా అన్నారు. ఈ మేరకు పట్టణంలోని సంజీవని బాలల వసతి గృహంలో షేర్‌ స్వచ్ఛంద సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సర్వేవర్‌ నెట్‌వర్కింగ్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ రకాల వేధింపులు, కష్టాల నుంచి బయటపడిన బాలికలు, మహిళలకు మానసిక ధైర్యాన్ని నింపుతున్నామన్నారు. వారిని సమాజంలో స్వశక్తితో ఎదిగేలా ప్రోత్సహించడం కార్యక్రమ ప్రధాన లక్ష్యం అన్నారు. షేర్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు శిరీష మాట్లాడుతూ చట్టపరమైన రక్షణలు, ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి మార్గాలపై అవగాహన కల్పించారు. సీడబ్ల్యూసీ మెంబర్‌ సాహిదా మాట్లాడుతూ బాలికల రక్షణ, సంక్షేమం, పునరావాసంపై చర్చించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ డైరెక్టర్‌ డాక్టర్‌ మోహన్‌రావు, ఐసీపీఎస్‌ సుమన్‌, చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ 1098 మౌనిక, షేర్‌ స్వచ్ఛంద సంస్థ కమ్యూనిటీ మొబులైజర్స్‌ ప్రశాంతి, కల్పన, గాయత్రి, ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement